AAP on ‘Freebies’: ఎన్నికల సమయంలో ‘ఉచితాలు’ ప్రకటించడం తప్పు కాదు: సుప్రీంకోర్టుకు ఆప్

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ 'ఉచితాలు' ప్రకటిస్తుండడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్‌)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు 'ఉచితాల' కిందికి రావని పేర్కొంది. సమానత్వం లేని సమాజంలో ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి అని తెలిపింది.

AAP on ‘Freebies’: ఎన్నికల సమయంలో ‘ఉచితాలు’ ప్రకటించడం తప్పు కాదు: సుప్రీంకోర్టుకు ఆప్

AAP on 'Freebies'

AAP on ‘Freebies’: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ ‘ఉచితాలు’ ప్రకటిస్తుండడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్‌)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ‘ఉచితాల’ కిందికి రావని పేర్కొంది. సమానత్వం లేని సమాజంలో ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి అని తెలిపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం.. ఉచితంగా విద్యుత్తు, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, రాత్రి పూట పేదలకు శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేసి ఇవ్వడంపై ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి హక్కుగా ఉన్నాయని ఆప్ చెప్పింది. ఉచిత విద్యుత్తు, నీళ్ళు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదంటూ నిబంధన తీసుకురావడం సరికాదని పేర్కొంది. సామాజిక, సంక్షేమ అజెండాను ఎన్నికల హామీల్లోంచి తీసివేసి, కుల, మతపర హామీలు ఇవ్వాలని పిటిషనర్ కోరుకుంటున్నట్లు ఉందని చెప్పింది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని పేర్కొంది.

కాగా, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ఉచితాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టేలా ‘ఉచితాల’ హామీలు తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే, ఉచితంగా విద్య, విద్యుత్తు, నీళ్ళు అందించడం నేరం అనేలా వాతావరణాన్ని సృష్టించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మాత్రం కొందరికి సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిందని అన్నారు. దీని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదని అన్నారు.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్