Rakesh Asthana : కేంద్రం-కేజ్రీ సర్కార్ మధ్య కొత్త రగడ

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది.

Rakesh Asthana : కేంద్రం-కేజ్రీ సర్కార్ మధ్య కొత్త రగడ

Rakesh (1)

Rakesh Asthana ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా గుజరాత్‌ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాకేశ్‌ ఆస్తానాని నియమిస్తూ మంగళవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం.. బుధవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేష్ ఆస్థానా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే రాకేష్ ఆస్థానా నియామకాన్ని కేజ్రీవాల్ సర్కార్ వ్యతిరేకిస్తోంది.

మాజీ సీబీఐ ఆఫీసర్ అయిన రాకేష్ ఆస్థానా ఢిల్లీ పోలీస్ కమిషర్ గా కేంద్ర హోంశాఖ నియమించడాన్నిగురువారం ఢిల్లీ అసెంబ్లీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది. రాకేశ్ ఆస్థానా నియామకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానం కోరింది. ఆయనకు బదులుగా వేరొక అధికారిని నియమించేందుకు తాజాగా ప్రక్రియను ప్రారంభించాలని కోరాలని తెలిపింది.

రాకేష్ ఆస్ధానా నియామకం.. 2019 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి పూర్తి ఉల్లంఘన అని తీర్మాణంలో పేర్కొన్నారు. 2019 నాటి తీర్పులో..సర్వీసు కాలం ఆరు నెలల కన్నా తక్కువగా ఉన్నవారిని దేశంలోని ఎక్కడైనా ఫోలీస్ ఫోర్స్ హెడ్ లేదా డీజీగా నియమించడకూదని సుప్రీంకోర్టు చెప్పిందని,అయితే రాకేష్ ఆస్థానా పదవీ కాలం నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఆప్ నేత సత్యేంద్ర జైన్ తెలిపారు. ఆయనకు బదులుగా వేరొక అధికారిని నియమించేందుకు తాజాగా ప్రక్రియను కేంద్ర హోంశాఖ ప్రారంభించాలన్నారు. కాగా,ఆప్ తీర్మాణాన్ని బీజేపీ వ్యతిరేకించింది.

అయితే, ప్రజా ప్రయోజనపు ప్రత్యేక కేసుగా పరిగణించి రాకేష్ ఆస్థానా సర్వీస్ ని ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.