ప్రమాణస్వీకారానికి రండి…లిటిల్ కేజ్రీవాల్ కు ఆప్ ఆహ్వానం

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2020 / 11:56 AM IST
ప్రమాణస్వీకారానికి రండి…లిటిల్ కేజ్రీవాల్ కు ఆప్ ఆహ్వానం

ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బుడ్డోడి ఫొటో సోషలో మీడియాలో తెగ వైరల్ అయింది. ‘బేబీ కేజ్రీవాల్’ అంటూ ఆ బుడతడి ఫొటోను తెగ షేర్ చేశారు నెటిజన్లు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మఫ్లర్ మాన్ అంటూ ఆ బుడ్డోడి ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ క్యూట్ లిటిల్ అరవింద్ కేజ్రీవాల్ కు ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాండ్ వెల్ కమ్ చెప్తూ చేసిన ఓ పెద్ద ప్రకటనతో ఈ బుడ్డోడు మరోసారి స్పాట్ లైట్ లోకి వెలుగులోకి వచ్చాడు. ఈ బేబీ మప్లర్ మాన్ ను ఫిబ్రవరి-16,2020న ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆప్ గురువారం(ఫిబ్రవరి-13,2020)ట్వీట్ చేసింది. సూట్ అప్ జూనియర్ అంటూ  ఆ ట్వీట్ ను ముగించింది ఆప్.

అయితే ఈ పోస్ట్ కు ఇప్పుడు లైక్ లు,రీట్వీట్ లు వేలల్లో వచ్చేస్తున్నాయి. బుడ్డోడు మంచి అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే…సందర్భం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి పిల్లవాడు చాలా చిన్నవయస్సున్నవాడు అయినప్పటికీ, అతన్ని ఆహ్వానించడం ఆనందంగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి-16,2020న ఢిల్లీ సీఎంగా మూడవసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటే మంత్రుల ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని సమాచారం. అయితే పాతవాళ్లనే మరోసారి కేబినెట్ లో కొనసాగించాలని,కొత్త వాళ్లకు నో ఛాన్స్ అంటూ కేజ్రీవాల్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

See also : నితిన్ పెళ్లిచేసుకోబోయేది ఈమెనేనా?