Aam Aadmi Party: ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో నెరవేరనున్న కేజ్రీవాల్ లక్ష్యం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా దక్కే అవకాశాలున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలు దక్కించుకుంటే చాలు.

Aam Aadmi Party: ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో నెరవేరనున్న కేజ్రీవాల్ లక్ష్యం

Aam Aadmi Party: అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’కి జాతీయా హోదా దక్కే అవకాశాలున్నాయి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో పార్టీకి గుర్తింపు దక్కితే, ఆ పార్టీకి జాతీయ హోదా ఇస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ లెక్కన ఈసారి ‘ఆప్’కి జాతీయ హోదా దక్కొచ్చు.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యం నెరవేరనుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది. గోవాలో పోటీ చేయడంవల్ల ఆ పార్టీకి అక్కడ గుర్తింపు దక్కింది. దీంతో మరో రాష్ట్రంలో కూడా పోటీ చేసి, కనీస స్థానాలు, ఓట్లు దక్కించుకుంటే ఆ రాష్ట్రంలో కూడా గుర్తింపొస్తుంది. అంటే అసెంబ్లీలో 2 సీట్లు, ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలి. ఈ నేపథ్యంలో ఇటీవలి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ ఇక్కడ కూడా అధికారికంగా గుర్తింపు పొందనుంది. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ కనీసం 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కితే, ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కినట్లే.

Elon Musk: ఎలన్ మస్క్‌కు షాక్.. తగ్గిపోతున్న సంపద.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్

ఇదే జరిగితే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా, ఒకే గుర్తుపై పోటీ చేసే వీలుంటుంది. కేజ్రీవాల్.. పార్టీ ప్రారంభించిన పదేళ్లలోనే ఈ ఘనత దక్కించుకోబోతుండటం విశేషం. ప్రస్తుతానికి దేశంలో ఏడు పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉంది. అవి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ.