AAP in Trouble: మరో వివాదంలో ఆప్ సర్కారు.. ఈ సారి బస్సు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ఎల్జీ

లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విచారణ కొనసాగుతుండగానే, ఆ ప్రభుత్వంపై మరో ఫిర్యాదు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బస్సు కొనుగోళ్లలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు.

AAP in Trouble: మరో వివాదంలో ఆప్ సర్కారు.. ఈ సారి బస్సు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ఎల్జీ

AAP in Trouble: లిక్కర్ స్కాం అంశం మరువక ముందే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు మరో వివాదంలో చిక్కుకుంది. లో ఫ్లోర్ బస్సుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపించాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి ఫిర్యాదు చేశారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

ఇటీవల బీఎస్-IV, బీఎస్-VI ప్రమాణాలు కలిగిన వెయ్యి లో ఫ్లోర్ బస్సులు కొనేందుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అవకతవకలు జరిగాయని పేర్కొంటూ, దీనిపై విచారణ జరిపించాలని వీకే సక్సేనా సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కూడా ధృవీకరించారు. అయితే, ఎల్జీ ఆరోపించినట్లుగా బస్సుల కొనుగోలు ఇంకా జరగలేదని, టెండర్ల ప్రక్రియ కూడా రద్దైందని సౌరభ్ అన్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

‘‘ఎల్జీపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. వాటికి సమాధానం చెప్పకుండా, తన అవినీతిపై ప్రజల దృష్టి మరల్చేందుకే ఎల్జీ ఆప్ ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. అన్నింటిపైనా విచారణ జరిపారు. కానీ, ఎక్కడా అవినీతికి సంబంధించిన ఆధారాలు బయటపడలేదు. ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. ఇప్పుడు ఇంకో మంత్రిపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాట్లాడాలి’’ అని ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. లో ఫ్లోర్ బస్సులు ఆధునికమైనవి. వీటిలో మెట్లు ఉండవు. ఒకే ఫ్లోర్‌గా ఉంటాయి.