ఆప్ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ విలవిల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 03:57 AM IST
ఆప్ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ విలవిల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ అందుకుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ (36) దాటింది. హాఫ్ సెంచరీకిపైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఆప్ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతున్నాయి. ఆప్ జోరుతో ఆ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. 

53 స్థానాల్లో ఆప్, 14 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ గతంలో కంటే కాస్త పుంజుకుంది. ఈశాన్య, వాయువ్య ఢిల్లీలో బీజేపీ సత్తా చాటింది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ (ఆప్), పట్ పడ్ గంజ్ లో మనీష్ సిసోడియా (ఆప్), ఆదర్శ్ నగర్ లో పవన్ శర్మ (ఆప్) ముందంజలో ఉన్నారు. 

రోహిణిలో విజేందర్ గుప్తా (బీజేపీ), బగ్గాలో తాజిందర్ పాల్ సింగ్ (బీజేపీ) ముందంజలో ఉన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్, కొండ్లి, కృష్ణానగర్, ద్వారకా, జనక్ పురి, మోతీనగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 

బల్లిమారన్ లో హరూన్ యూసుఫ్ (కాంగ్రెస్) అధిక్యంలో ఉన్నారు. చాందినిచౌక్ లో అల్కాలాంబా (కాంగ్రెస్) వెనుకంజలో ఉన్నారు. షాకూర్ బస్తీ అసెంబ్లీలో మంత్రి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు.

ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు పోటీచేసిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. మధ్యాహ్నం కల్లా #DelhiResults వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ఎగ్జిట్ ఫోల్స్ కూడా తేల్చేశాయి.