Amit Shah: రేపే గుజరాత్ తొలి దశ ఎన్నికలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటూ రాదన్న అమిత్ షా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవబోదని అభిప్రాయపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుదన్నారు.

Amit Shah: రేపే గుజరాత్ తొలి దశ ఎన్నికలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటూ రాదన్న అమిత్ షా

Amit Shah: గుజరాత్ తొలి దశ ఎన్నికలు గురువారం (డిసెంబర్ 1) జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవబోదని చెప్పారు.

Chhattisgarh: పోర్న్ వీడియోలు చూసి పక్కింటి బాలికపై యువకుడి హత్యాచారం.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఎన్నికలపై అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీని గుజరాత్ ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. గుజరాత్ ఫలితాల కోసం ఎదురు చూడండి. విజేతల జాబితాలో అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పేరే ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ, ఆయన చేసిన పనుల ముందు ఏ ఫ్రంట్ అయినా నిలబడదు. ఒక ప్రాంతీయ పార్టీకి మరో రాష్ట్రంలో విలువ ఉండదు. పార్టీల కూటములు పేపర్ మీదే బాగుంటాయి. వార్తలుగా మాత్రమే పనికొస్తాయి’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. గుజరాత్ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

గురువారం ఎన్నికలు జరుగుతాయి. మొత్తం గుజరాత్ అసెంబ్లీకి 182 స్థానాలు ఉండగా, గురువారం సౌరాష్ట్ర పరిధిలోని 89 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ ఎన్నికలో మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పోటీ త్రిముఖంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తోడు ఆమ్ ఆద్మీ కూడా కీలకంగా ఉంది.