Delhi MCD Elections: 15ఏళ్ల కాషాయ కోటను బద్దలు కొట్టిన ఆప్.. ఢిల్లీ కార్పొరేషన్ పీఠం కైవసం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది. బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయింది.

Delhi MCD Elections: 15ఏళ్ల కాషాయ కోటను బద్దలు కొట్టిన ఆప్.. ఢిల్లీ కార్పొరేషన్ పీఠం కైవసం

AAP WON

Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ.. కార్పొరేషన్ లో మాత్రం ఆప్ పాగా వేయలేక పోయింది. 15ఏళ్లుగా బీజేపీనే కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆప్ విజయ దుందబి మోగించి తొలిసారి పూర్తిస్థాయి మద్దతుతో ఢిల్లీ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకుంది. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ .. స్వల్ప ఆధిక్యంలో ఆప్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో మొత్తం 250 స్థానాలకు‌గాను మ్యాజిక్ ఫిగర్ 126 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే, ఆప్ సొంతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 134 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకొనేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీని సాధించింది. బీజేపీ అభ్యర్థులు 103 స్థానాల్లో విజయం సాధించారు. ఆప్ కు బీజేపీ గట్టిపోటీనే ఇచ్చింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య పోరు సాగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఫూర్తిగా ఢీలాపడిపోయింది. కేవలం 10 వార్డుల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

Delhi civic polls: నేఢే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. 250 స్థానాలకు పోటీ.. పింక్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

ఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ 1958లో ఏర్పాటైంది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్దరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ పీఠంపై గత 15ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంటూ వస్తుంది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్లో గెలుచుకుంది.

MCD elections: ఆప్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.. దాడి చేసి తరిమికొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు

ఢిల్లీ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవటంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని, అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ఓటు వేశారని అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ చల్లుతున్న బురదను తుడిచివేశారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.