అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

పాకిస్థాన్ F-16 విమానాన్ని కూల్చిన భారత IAF కమాండర్ అభినందన్ వర్థమాన్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 05:42 AM IST
అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

పాకిస్థాన్ F-16 విమానాన్ని కూల్చిన భారత IAF కమాండర్ అభినందన్ వర్థమాన్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

ఢిల్లీ : పాకిస్థాన్ F-16 విమానాన్ని కూల్చిన భారత IAF కమాండర్ అభినందన్ వర్థమాన్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఎఫ్-16కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చిన తొలి పైలట్ గా భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చరిత్రలో నిలిచిపోయారు. F-16 విమానాన్ని కూల్చిన తొలి తొలి వాయు సైనికుడు అతనేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ వెల్లడించారు. 
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం

అమెరికా తయారుచేసిన ఈ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఈ ఎఫ్-16  యుద్ధ విమానాన్ని కూల్చడం అత్యంత సాహసోపేతమైన చర్యని ఎయిర్ చీఫ్ మార్షల్  కితాబిచ్చారు. వాస్తవానికి ఎఫ్-16కు మిగ్-21 సాటిరాదని ఆయన అన్నారు. యుద్ధంలో మిగ్ లతో పోలిస్తే ఎఫ్-16లు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. మిగ్ విమానాలను నడిపే పైలట్లు తమ స్కిల్స్ ను పెంచుకునేందుకు మిత్ర దేశాల వద్ద ఉన్న ఎఫ్-16, మిరాజ్ ఫైటర్ జెట్స్ తోనూ శిక్షణ పొందుతుంటారని..అదే అభినందన్ కు ఉపయోగపడిందన్నారు.

ఎయిర్ వార్ చాలా వేగంగా ఉంటుందని..ఒత్తిడితో కూడినదనీ..శత్రువుల కంటే ఫాస్ట్ గా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కమాండర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనీ..ఈ క్రమంలో కేవలం రెప్పపాటులో  సరిహద్దులను దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని..ఇటువంటి పరిస్థితుల్లో అభి, ఎఫ్-16 విమానాన్ని కూల్చడం అసాధారణమేనని కృష్ణస్వామి అయ్యర్ వివరించారు. అంతటి సాహసోపేతమైన పని మన కమాండర్ అభినందన్ వర్థమాన్ చేసి చరిత్రలో నిలిచిపోయారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు.
Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

ఎఫ్‌-16 కు మిగ్-21 కు తేడా 
ఎప్పుడో 1950ల నాటి మిగ్‌-21ను నడుపుతున్న మన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ గాల్లో అద్భుత విన్యాసాలు నిర్వహిస్తూ పాక్‌కు చెందిన 1980ల నాటి ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఈ రెండు రకాల యుద్ధవిమానాల పోరాట సామర్థ్యాల మధ్య భూమ్యాకాశాల వైరుద్ధ్యం ఉంది. మన మిగ్‌-21 మూడో తరం యుద్ధవిమానం కాగా ఎఫ్‌-16 దానికి మించిన నాలుగోతరం లోహ విహంగం.

అంతటి శక్తివంతమైన విమానంతో మిగ్ -21 విమానంతో వెంబడించటమే కాక..1980ల నాటి ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు మన మన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌. మరి అంతటి శౌర్యప్రతాపుడికి ఈ అరుదైన రికార్డు సాధించారటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని సాక్షాత్తు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ దృవీకరించారు. 
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు