Pandemic Lockdown : 2020 లాక్‌డౌన్‌లో భారతీయులంతా ఏంచేశారంటే?

2020 అనగానే టక్కున గుర్తుచ్చేది కరోనావైరస్. ప్రపంచాన్ని ఈ కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతోనే ఉంది. కరోనా మొదలైనప్పటి నుంచి జీవనశైలిలో అనేక మార్పులకు దారితీసింది.

Pandemic Lockdown : 2020 లాక్‌డౌన్‌లో భారతీయులంతా ఏంచేశారంటే?

Indians Started Mobile Gaming In 2020, Due To Pandemic Lockdown

Mobile Gaming In 2020 During Pandemic Lockdown : 2020 అనగానే టక్కున గుర్తుచ్చేది కరోనావైరస్. ప్రపంచాన్ని ఈ కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతోనే ఉంది. కరోనా మొదలైనప్పటి నుంచి జీవనశైలిలో అనేక మార్పులకు దారితీసింది. కొత్త అలవాట్లు, ఆరోగ్యం, కుటుంబ బంధాల్లో అనేక మార్పులు వచ్చాయి. కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. కొన్ని నెలల పాటు లాక్ డౌన్ జీవితాలను గడపాల్సి వచ్చింది. అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.

కరోనా లాక్ డౌన్ ఎన్నో పాఠాలు నేర్పింది.. కొత్త విషయాలు, అలవాట్లు నేర్చుకున్నారు. 2020 లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా ఒకలా ఉంటే.. దాదాపు మన భారతీయులందరూ ఒకే పనిలో నిమగ్నమైపోయారంట. 45శాతం మంది భారతీయులు మొబైల్ గేమింగ్ ఆడటం మొదలుపెట్టారంట.. ఇంట్లోనే ఉండి తమ స్మార్ట్ ఫోన్లలో గేమింగ్ ఆడుతూ కాలక్షేపం చేశారంట.

Mobile Gaming In 2020, Due To Pandemic Lockdown

InMobi అనే యాడ్ టెక్ సంస్థ ఈ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో కేవలం ఎక్కువ సమయం మొబైల్ గేమింగ్ ఆడటమే కాదు.. వేర్వేరు యాప్ లతో అనేక ప్రయోగాలు కూడా చేసినట్టు పేర్కొంది. ఒక రోజులో సగటున 40శాతం మంది భారతీయులు గేమింగ్ యాప్స్ ఆడగా.. మీటింగ్స్, షోర్స్, మీల్స్ మధ్యలో 10 నిమిషాల సెషన్స్ గేమ్స్ తోనే గడిపేశారంట.. ఇతర పనులు చక్కబెడుతూనే మరోవైపు 84శాతం మంది మొబైల్ గేమింగ్ ఆడేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. కూర్చొన్న చోట గేమ్ ఆడేందుకు కనీసం గంట వరకు సమయాన్ని గడిపేశారు.

ఇండియాలో గేమింగ్ పై పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో యువత, ఆడ, మగ, వయస్సుతో సంబంధం లేదు. చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో మరింత ఈజీ అయిపోయింది. భారతదేశంలో మొబైల్ గేమర్లలో 43శాతం మంది మహిళలు కూడా ఉన్నారని నివేదిక వెల్లడించింది. వారిలో 12శాతం మంది 25ఏళ్ల నుంచి 44ఏళ్ల మధ్య వయస్సు వారు ఉండగా.. 45ఏళ్ల వయస్సు ఉన్నవారు 28శాతం మంది ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ 12శాతం పెరిగింది. బార్క్ అండ్ నీల్సన్ నివేదిక ప్రకారం, వారానికి ఒక యూజర్ మొబైల్ గేమ్స్ కోసం గడిపిన సగటు సమయం లాక్ డౌన్ కు ముందు 151 నిమిషాల నుంచి లాక్ డౌన్ సమయంలో 218 నిమిషాలకు పెరిగింది.