Assembly Elections : పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

వచ్చే ఏడాది దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ఏబీపీ - సి ఓటర్ సర్వే నిర్వహించింది

Assembly Elections : పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

Assembly Elections

Assembly Elections : 2022లో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏబీపీ సీఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలే ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూస్తుందని ఈ సర్వేలో తేలింది.

ఇక్కడ ఆప్ ఆధిపత్యం చూపుతుందని, 55 స్థానాల్లో ఆప్ విజయం సాదిస్తుందని తెలిపారు. ఇక 37 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాదించనుందని వెల్లడించారు. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీ మరోసారి అధికారం కైవసం చేసుకోనున్నట్లు ఏబీపీ సీ- ఓటర్ సర్వేలో వెల్లడైంది.

పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీ పతనానికి కారణం అవుతాయని, ఇది ఆప్ కి అనుకూలిస్తుందని వివరించారు. అయితే 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావ చూపలేదని వెల్లడించారు. రైతు చట్టాల వ్యవహారం ఈ రాష్ట్రంలో బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని సర్వేలో తెలిపారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.