ABP C-Voter Survey: ఇండియన్ మినీ పోల్స్.. ఉత్తరప్రదేశ్‌లో అధికారం ఎవరిది?

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షం తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ABP C-Voter Survey: ఇండియన్ మినీ పోల్స్.. ఉత్తరప్రదేశ్‌లో అధికారం ఎవరిది?

Up Polls

ABP C-Voter Survey: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షం తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోండగా.. అదే స‌మ‌యంలో యూపీలో అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. అధికారం ఎవ‌రిది? అని దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందుకు కారణం కూడా లేకపోలేదు.. మినీ ఇండియన్ పోల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో గెలుపు తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కూడా పడుతుంది. ఈ క్రమంలోనే ఏబీపీ న్యూస్ సీ-వోటర్ సర్వే ద్వారా యూపీలోని మొత్తం 403 సీట్లలో ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ABP న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం ఓట్లపరంగా బీజేపీకి ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం బీజేపీకి 41 శాతం ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీకి 33 శాతం ఓట్లు వచ్చాయి. సర్వేలో బహుజన్ సమాజ్‌వాది పార్టీ మూడవ స్థానంలో ఉండగా.. ఆ పార్టీ వాటా 13 శాతం ఓట్లుగా ఉంది. సర్వే ప్రకారం, కాంగ్రెస్ 8 శాతం ఓట్లను కైవసం చేసుకోగా, యూపీలో నాలుగో పార్టీగా కొనసాగుతుంది.

యూపీలో ఎవరికి ఎన్ని ఓట్లు?
మొత్తం సీట్లు- 403

BJP + 41%
SP + 33%
BSP 13%
కాంగ్రెస్-8%
ఇతరులు, ఎవరికీ వెయ్యనివారు -5%

ABP న్యూస్ సీ ఓటర్ వారం వారం సర్వే చేస్తుండగా.. గత సర్వేలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు 40 శాతం ఓట్లు రాగా, నేటి సర్వేలో బీజేపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాల ఓట్లు కూడా ఒక శాతం పెరిగాయి, గతసారి 32 శాతం ఓట్‌షేర్ రాగా.. ఈసారి 33 శాతం ఓట్‌షేర్‌ దక్కించుకుంది. ఈ సర్వేలో బీఎస్పీ ఒక్క శాతం ఓట్లను కోల్పోయింది. బహుజన్ సమాజ్ పార్టీకి ఈసారి 13 శాతం ఓట్లు పోలయ్యాయి. గత సర్వేలో కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు రాగా, ఈసారి కూడా కాంగ్రెస్ అదే ఓట్ల శాతంలో కొనసాగుతోంది.

Konijeti Rosaiah: గాంధీ భవన్‌కి రోశయ్య పార్థివదేహం.. నేడే అంత్యక్రియలు

27 నవంబర్- సర్వే:
BJP+ 40%
SP+ 32%
BSP 14%
కాంగ్రెస్ – 8%
ఇతరులు – 6%

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడిగా ఉంది. ఈ సర్వేలో యూపీకి చెందిన 11 వేల 85 మంది పాల్గొన్నారు. సర్వే నవంబర్ 25 నుండి డిసెంబర్ 1 వరకు జరిగింది.

RGV: ‘సిరివెన్నెలకి ఓ ముద్దు’.. పాట పాడిన రామ్‌గోపాల్ వర్మ