India Tells EU : ఈయూకి భారత్ అల్టిమేటం..కోవిషీల్డ్,కోవాగ్జిన్ అంగీకరిస్తారా లేక క్వారంటైన్ ఎదుర్కొంటారా!

భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

India Tells EU : ఈయూకి భారత్ అల్టిమేటం..కోవిషీల్డ్,కోవాగ్జిన్ అంగీకరిస్తారా లేక క్వారంటైన్ ఎదుర్కొంటారా!

Vaccine (1)

India Tells EU భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో భారత్ దీనిపై సీరియస్ గా స్పందించింది.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను గుర్తించడంపై భారతదేశం పరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అంటే ఇండియన్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లను యూరోపియన్ యూనియన్ అంగీకరించేంత వరకూ..ఆ దేశాల వ్యాక్సిన్ సర్టిఫికెట్ లను కూడా బారత్ లో కూడా అంగీకరించరు. యూరప్ నుంచి భారత్ కు వచ్చే వాళ్లు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే యూరోపియన్ యూనియన్.. డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లో తప్పనిసరిగా కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను నోటిఫై చేయాలని ఈయూకి చెప్పడం జరిగిందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.