Restaurant Staff Negligence : రెస్టారెంట్‌ లో దారుణం.. వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్ పంపిణీ

పాకిస్తాన్‌లోని పోయిట్ రెస్టారెంట్‌లో దారుణం జ‌రిగింది. బ‌ర్త్ డే పార్టీ వేడుకలో వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్‌తో చేతులు క‌డుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మ‌రో అమ్మాయి నోరు కాలిపోయింది.

Restaurant Staff Negligence : రెస్టారెంట్‌ లో దారుణం.. వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్ పంపిణీ

Restaurant Staff Negligence : పాకిస్తాన్‌లోని పోయిట్ రెస్టారెంట్‌లో దారుణం జ‌రిగింది. బ‌ర్త్ డే పార్టీ వేడుకలో వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్‌తో చేతులు క‌డుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మ‌రో అమ్మాయి నోరు కాలిపోయింది. ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబ‌ర్ 27న మ‌హ్మ‌ద్ అదిల్ కుటుంబంలో ఒక‌రి బ‌ర్త్‌డే పార్టీని పోయిట్ రెస్టారెంట్‌లో నిర్వ‌హించారు.

అయితే రెస్టారెంట్ సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు నీళ్ల బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. బాటిల్స్‌లో నీళ్లు ఉన్నాయ‌కున్న పిల్ల‌లిద్ద‌రూ ఒక‌రు చేతులు క‌డుక్కోగా, మ‌రొక‌రు నోట్లో పోసుకున్నారు.

McDonald’s : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత

దీంతో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌హ్మ‌ద్ అదిల్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రెస్టారెంట్ య‌జ‌మానిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.