నటన వ్యాపారం.. రాజకీయం నా కోరిక: బీజేపీతో కమల్ పొత్తు!

నటన వ్యాపారం.. రాజకీయం నా కోరిక: బీజేపీతో కమల్ పొత్తు!

రాజకీయం, సినిమా  రెండింటినీ తాను కలుపబోనని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇప్పుడు తమిళనాడు ప్రజలు అందరూ కమల్, రజనీకాంత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఆశక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే కమల్ తాన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 39 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించగా, రజనీకాంత్ మాత్రం ఇంకా తన పార్టీ పేరుని ప్రకటించలేదు. గురువారం చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ… నటన వ్యాపారం, రాజకీయం నా కోరిక, ఈ రెండింటిని కలుపబోనన్నారు.

 త్వరలో రాబోయో  భారతీయు-2లో రాజకీయ నాయకుడి పాత్రలో కమల్ కన్పించడాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని కమల్ ని ప్రశ్నించగా.. ఇది ఒక నాయకుడి నటనగా మాత్రమే చూడాల్సిన అవసరముంటుందని తెలిపారు. ఒకవేళ దానికి మించిన ఏదైనా సంబంధిత సోషల్ మెసేజస్ ఉంటే తాను ముందుకొచ్చి వాటి గురించి మాట్లాడుతానని అన్నారు. సినిమా ద్వారా మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేరళలో అల్లర్లకు ఆరెస్సెస్ కారణమని కమల్ అన్నారు. 

దక్షిణభారతంలో బీజేపీని బలోపేతం చేసేందుకు రజనీ, కమల్ పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకోబోతుందా అని ఇంటర్వ్యూలో ప్రధాని మోడీని ప్రశ్నించగా.. తాము ఎప్పుడూ అందరితో కలిసి నడవడానికే ప్రయత్నిస్తామని, ఎవరైతే మాతో కలిసి నడవాలనుకుంటారో, మేము ఎవరితో కలిసి వెళ్లాలనుకుంటామో అనేవి స్థానికుల ఆకాంక్షలను బలపర్చే విషయంలో తమ సిద్దాంతానికి లింక్ అయి ఉంటాయని మోడీ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై కమల్ మాట్లాడుతూ..మేము కనుక మోడీతో కలిసివెళ్తే మోడీ మాతో పొత్తు పెట్టుకుంటాడు. అయితే మేము కలిసి వెళ్లాలా లేదా అనేది ప్రత్యేక మీటింగ్ లో చర్చిస్తామని కమల్ తెలిపారు. కరుణానిధి మరణంతో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటన వెలువడటంపై కమల్ సంతోషం వ్యక్తం చేశారు, కనీసం ఇప్పటికైనా ఉప ఎన్నిక ప్రకటన చేయడం పట్ల తాను హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.