దేశంలో వరుసగా రెండో రోజు తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో వరుసగా రెండో రోజు తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు

Active Covid

Active Covid-19 cases దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులోనే 11,122 యాక్టిన్ కేసులు తగ్గినట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 37,04,009కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 15.87 శాతం యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది.

దేశంలో బుధవారం 3,48,421 కొత్త కరోనా కేసులు,4205మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో 71.2శాతం కేసులు కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,రాజస్తాన్,ఢిల్లీ,హర్యానా,ఉత్తరప్రదేశ్,వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు తెలిపింది. 73.17 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లో నమోదైనట్లు తెలిపింది.

ఇక, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,93,82,642కి చేరినట్లు తెలిపింది. గడిచిన 24గంటల్లోనే 3,55,338 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 82.51శాతం కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,ఛత్తీస్ గఢ్,వెస్ట్ బెంగాల్,హర్యానా,బీహార్,ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,రాజస్తాన్,గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. జాతీయ మరణాల రేటు ప్రస్తుతం 1.09శాతంగా ఉందని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 17,52,35,991 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిచినట్లు తెలిపింది. మొదటి డోసు తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 95,82,449 మంది కాగా…రెండో డోసు తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 25,47 534. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 45-60ఏళ్ల లోపు వయస్సు వారు 5,58,83,416మంది కాగా..రెండో డోస్ తీసుకున్నవాళ్లు 78,36,168మంది. 60ఏళ్లు దాటిన వాళ్లలో మొదటి డోస్ తీసుకున్నవారు 5,39,59,772మంది కాగా…రెండో డోసు తీసుకున్నవాళ్లు 1,62,88,176మంది. 18-44ఏళ్ల లోపు వాళ్లలో మొదటి డోస్ తీసుకున్నవాళ్లు 4,79,282మంది.

ఇక,విదేశాల నుంచి సాయంగా వచ్చినవి… 9,200 ఆక్సిజన్ మెషిన్లు,19 ఆక్సిజన్ ప్లాంట్లు,5913వెంటిలేటర్లు,3.44లక్షల రెమిడెసివిర్ వయల్స్