Covid cases: దేశంలో 2,149కి పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు: కేంద్రం

 దేశంలో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2,149కి చేరిందని చెప్పింది. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందారని, వారిలో నలుగురు కేరళకు చెందిన వారు, ఒకరు సిక్కింకు చెందిన వారని వివరించింది.

Covid cases: దేశంలో 2,149కి పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు: కేంద్రం

CORONA

Covid Cases: దేశంలో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2,149కి చేరిందని చెప్పింది. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందారని, వారిలో నలుగురు కేరళకు చెందిన వారు, ఒకరు సిక్కింకు చెందిన వారని వివరించింది.

వైరస్ వల్ల దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 5,30,769కు పెరిగిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,86,017) చేరిందని, కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,53,099గా ఉందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు వాడిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 220,63,80,682గా ఉందని వివరించింది. నిన్న 5,841 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. నిన్న దేశంలో 1,04,494 కరోనా పరీక్షలు చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Lok Sabha polls 2024: కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది: ప్రియాంకా గాంధీ