సుషాంత్ కేసు విచారణ ముంబైలో జరగాలంటూ సుప్రీంను ఆశ్రయించిన రియా చక్రవర్తి

సుషాంత్ కేసు విచారణ ముంబైలో జరగాలంటూ సుప్రీంను ఆశ్రయించిన రియా చక్రవర్తి

సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక యాక్టర్ రియా చక్రవర్తి ఉందంటూ ఆరోపిస్తూ పాట్నాలో ఫైల్ అయి ఉన్న కేసును ముంబై ట్రాన్సఫర్ చేయాలని కోరుతోంది రియా. ఇప్పటికే ముంబై పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆమెతో పాటు మరికొందరి స్టేట్‌మెంట్లను తీసుకున్నట్లు రియా చక్రవర్తి అన్నారు.

సుషాంత్ సింగ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నాలో కేసు ఫైల్ అయింది. దీనిని ముంబైకి ట్రాన్షఫర్ చేయాలని ఒకేసారి రెండు ఇన్వెస్టిగేషన్లు చేయడం కుదరదని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులకు అడిగినప్పుడు కోఆపరేట్ చేస్తానని అన్నారు.



చక్రవర్తి తరపు న్యాయవాది సతీశ్ మనేషిండె ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీహార్ పోలీసులను ఇన్వెస్టిగేషన్ గురించి రిక్వెస్ట్ చేసింది. సుప్రీంకోర్టుకు తను పెట్టుకున్న విజ్ఞప్తి గురించి ఏదో ఒక విషయం చెప్పేవరకూ ఇన్వెస్టిగేషన్ ను ఆపి ఉంచాలని.

సుషాంత్ తండ్రి కేకే సింగ్.. పాట్నాలో చక్రవర్తితో పాటు మరో ఆరుగురిపై కేస్ ఫైల్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా ఈ ఆత్మహత్య జరగడంలో భాగమని పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తి రిలేషన్ షిప్ లో ఉండి సుషాంత్ ను మోసం చేసి, డబ్బు తీసుకుని పరారైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాట్నాలో కేసు ఫైల్ అయిన రెండో రోజే పోలీస్ టీం ముంబై వెళ్లింది.

ముంబై పోలీసులు జూన్ 14న సుషాంత్ చనిపోయిన కొద్దిరోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 40మందిని ప్రశ్నించారు. అందులో రియా చక్రవర్తి.. సహ నటులు, నిర్మాతలు, డాక్టర్లు కూడా ఉన్నారు.