Sonu Sood: రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు సోనూసూద్‌పై ఐటీ ఆరోపణలు

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంట్లో ఆదాయపు పన్ను సర్వే ముగిసింది. ఆదాయపు పన్ను బృందం సోనూ సూద్ ఇంటి నుండి వరుసగా రెండు రోజులు రాత్రి 12గంటల 30నిమిషాల వరకు సోదాలు నిర్వహించారు

Sonu Sood: రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు సోనూసూద్‌పై ఐటీ ఆరోపణలు

Sonusood

Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంట్లో ఆదాయపు పన్ను సర్వే ముగిసింది. ఆదాయపు పన్ను బృందం సోనూ సూద్ ఇంటి నుండి వరుసగా రెండు రోజులు రాత్రి 12గంటల 30నిమిషాల వరకు సోదాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను అధికారులు సోనూ సూద్ ఇంట్లో సర్వే చేశారు. సోను సూద్ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో, ఆదాయపు పన్ను అధికారులతో పాటు, సోనుసూద్ కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంది.

నటుడు సోనూసూద్‌పై ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేసిన తర్వాత, అతనిపై రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు కేసు వెలుగులోకి వచ్చిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వెల్లడించింది. CBDT సోనూసూద్ మరియు అతని సహచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో, పన్ను ఎగవేతకు సంబంధించిన నేరపూరిత సాక్ష్యాలు కనుగొన్నట్లు చెప్పారు. సోనూసూద్ బోగస్ లెక్కలు చూపని డబ్బును బోగస్ సంస్థల నుంచి అసురక్షిత రుణాలను తీసుకున్నట్లు CBDT చెబుతోంది.

FCRA చట్టాన్ని ఉల్లంఘిస్తూ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విదేశీ దాతల నుంచి సోనూసూద్ రూ.2.1 కోట్లను సేకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. CBDT ముంబైలోని సోనూసూద్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిమగ్నమైన లక్నో ఆధారిత పారిశ్రామిక క్లస్టర్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు CBDT తెలిపింది. CBDT ప్రకారం, ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్‌తో సహా మొత్తం 28 చోట్ల మూడు రోజుల పాటు వరుసగా సోదాలు నిర్వహించారు.

సోనూసూద్ స్థావరాలపై ఐటీ చర్యలను శివసేన ఖండించింది. మంచిపై బీజేపీ దాడిగా అభివర్ణించింది. ఒకప్పుడు ప్రశంసించి ఇప్పుడు అతన్ని ‘పన్ను దొంగ’గా బీజేపీ చిత్రీకరిస్తుందని అన్నారు. 48 ఏళ్ల సోను సూద్ కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయం చేయడం ద్వారా చాలా ప్రశంసలు పొందారు. ఇటీవల సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. ఈ క్రమంలోనే సోనూసూద్‌పై ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేసారు, సత్య మార్గంలో లక్షల ఇబ్బందులు ఉన్నాయి, కానీ విజయం ఎల్లప్పుడూ సత్యానికే వస్తుంది. సోను సూద్‌కు భారతదేశంలోని లక్షల కుటుంబాల సపోర్ట్ ఉంది. కష్ట సమయాల్లో సోనూసూద్ సపోర్ట్ ప్రజలకు ఉంది. సోనూసూద్‌పై కుట్రలు నిలవవు అని అన్నారు. వాస్తవానికి ఆప్ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి సోనూసూద్ ఉండవచ్చుననే వార్తలు వస్తున్న వేళ ఇప్పుడు అతని ఇళ్లపై సోదాలు జరగడం అనుమానాలకు కారణం అవుతోందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.