Malvika Sood : కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి | Actor Sonu Sood's Sister Malvika Sood Joins Congress Party

Malvika Sood : కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి

రియల్ హీరో సోనూసూద్ సోదరి మాల్వికా సూద్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నారు.

Malvika Sood : కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి

Malvika Sood : రియల్ హీరో సోనూసూద్ సోదరి మాల్వికా సూద్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు. మోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. స్వయంగా సోనూ సూద్ నివాసానికి వెళ్లారు. సోనూసూద్, మాల్వికతో చర్చలు జరిపారు.

ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. కరోనా సంక్షోభం సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సాయం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించారు. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన లక్షలాది మందిని తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించారు. కరోనా బాధితులు ఎంతోమందికి ఉచితంగా వైద్య సాయం అందించారు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థికంగా సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. పేదల పాలిట దేవుడిగా గుర్తింపు పొందారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తన సోదరికి తన మద్దతు ఉంటుందని సోనూసూద్ ఇదివరకే ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మాల్వికా సూద్ చెప్పారు.

ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

కాంగ్రెస్ పార్టీలో మాల్వికా సూద్ చేరికపై సిద్ధూ స్పందించారు. పంజాబ్ ఎన్నికల వేళ.. ఈ డెవలప్ మెంట్ ని గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ”పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్లడం చాలా అరుదైన ఘటన. మాల్వికా సూద్ అందుకు అర్హురాలు ”అని సిద్ధూ అన్నారు.

మాల్వికా సూద్ కాంగ్రెస్ లో చేరడంపై స్పందించిన సిద్ధూ..” క్రికెట్ ప్రపంచంలో గేమ్ చేంజర్ అనే పదం తరుచుగా వాడతారు. అది పంజాబ్ పాలిటిక్స్ కు సెట్ అవుతుంది. మాల్వికా సూద్ చాలా యంగ్. బాగా చదువుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఆమెకు ఇవన్నీ తోడ్పడతాయి” అని అన్నారు.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సోనూ సూద్ ను పంజాబ్ ఐకాన్ గా తొలగించడం తెలిసిందే. సోనూ సూద్ సోదరి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను గతంలో సోనూ సూద్ కు అప్పగించింది. పంజాబ్ ఐకాన్ గా నియమించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

Price Hike: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతోన్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ రేట్లు

తన సోదరి మాల్వికా.. రాజకీయాల్లో చేరనున్నారని, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని గతేడాది నవంబర్ లో సోనూసూద్‌ ప్రకటించారు. తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో ఎంతోమందిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన సోనూసూద్‌పై గతేడాది ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సోనూకి అండగా నిలిచి కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈ పరిస్థితుల్లో సోనూ సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌.. సెలబ్రిటీలతో ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

×