Adani Hindenburg Row : అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్, హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు గ్రీన్‌సిగ్నల్

అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

Adani Hindenburg Row : అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్, హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు గ్రీన్‌సిగ్నల్

Adani Hindenburg Row : అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

అదానీ గ్రూప్ పై త్వరితగతిన విచారణ చేపట్టాలని న్యాయవాది విశాల్ తివారీ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హిండెన్ బర్గ్ నివేదిక దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన పిల్ లో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తాను దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు శర్మ.

Also Read..Adani Group: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. పది రోజుల్లో 118 బిలియన్ డాలర్లు కోల్పోయిన అదానీ గ్రూప్

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసింది. దీనిపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనుంది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలన్నది పిటిషనర్ల అభ్యర్థన. అదానీ అంశంపై సుప్రీంకోర్టులో రెండు పిల్స్ దాఖలయ్యాయి. న్యాయవాది ఎంఎల్ శర్మ, విషాల్ తివారీ ఈ పిల్ లు దాఖలు చేశారు.

Also Read..Subramanian Swamy: సొంత పార్టీని మరింత ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు

హిండెన్ బర్గ్ నివేదిక ఇన్వెస్టర్లను ఎంతో నష్టానికి గురి చేసినట్టు పిటిషనర్లు ఆరోపించారు. దేశ ప్రతిష్టను హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు ఎంఎల్ శర్మ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారాలను చూపించడంలో హిండెన్ బర్గ్ సంస్థ అధినేత నాథర్ అండర్సన్ విఫలమైనట్టు వివరించారు.

అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్టు హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించడం తెలిసిందే. సెబీ సైతం హిండెన్ బర్గ్ అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే, హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేశాయి. దీనిపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా, అదానీకి మోదీ సహకారం ఉందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

ఏంటీ హిండెన్ బర్గ్..?
తమను తాము విజిల్ బ్లోయర్ గా చెప్పుకునే అమెరికన్ రీసెర్చ్ సంస్థ, వ్యాపారపరంగా వివాదాలు రేపి షార్ట్ సెల్లింగ్ ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించే సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్. అదానీ గ్రూప్ కి సంబంధించి నివేదిక విడుదల చేయడం ద్వారా అంతర్జాతీయంగా పెద్ద వివాదాన్ని, సంచలనాన్ని రేపగలిగింది. అదానీ సామ్రాజ్యాన్ని బోన్ లో నెలబెట్టగలిగింది. అదానీ సామ్రాజ్యం పూర్తిగా అప్పుల కుప్ప. అప్పుల మీద ఆధారపడి పెంచుకున్న అభివృద్ధి ఇది. కంపెనీ, షేర్ల విలువ పెంచుకోవడానికి అక్రమ, అనైతిక పద్దతులకు అదానీ గ్రూప్ పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఆరోపించింది. షేర్లను తనఖా పెట్టడం దాని ద్వారా అప్పులు తెచ్చుకోవడం. ఈ ప్రక్రియ ఏదీ రిలయబుల్ కాదు, సంస్థలు రిలయబుల్ కాదని తేల్చింది.

హిండెన్ బర్గ్ నివేదిక అదానీ వ్యాపార సామ్రాజ్యంపై పెను ప్రభావమే చూపింది. అదానీ గ్రూప్ లోని సంస్థలపై రుణభారం లక్షల కోట్లలో ఉందని, ఆ భారీ రుణాలు తీర్చే మార్గాలను వెదకడంలో అదానీ గ్రూప్ సంస్థలు విఫలమవుతున్నాయని హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎత్తిచూపింది. అంతే, ఒక్కసారిగా గౌతమ్ అదానీ సంపద భారీగా పతనమైంది. రోజుల వ్యవధిలో లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.