Adani: మీడియా రంగంలోకి అదానీ గ్రూప్!

దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్​ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Adani: మీడియా రంగంలోకి అదానీ గ్రూప్!

Adani

Quintillion Stake: దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్​ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. పవర్ టు పోర్ట్ బిజినెస్‌లో చురుగ్గా ఉండే గౌతమ్ అదానీ ఇప్పుడు మీడియా రంగంలోకి ప్రవేశించారు. రాఘవ్ బహ్ల్ మీడియా వెంచర్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్(QBM)లో అదానీ గ్రూప్ మైనారిటీ వాటాను తీసుకుంది.

మీడియా రంగంలో అదానీ గ్రూప్ డీల్ కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని నెలలుగా, ఈ గ్రూప్ మీడియా వ్యాపారంలోకి ప్రవేశించేందుకు చర్చలు జరుపుతుంది. ఎన్డీటీవీలో వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను అదానీ గ్రూప్, NDTV రెండూ ఖండించాయి.

అయితే, ఇప్పుడు అదానీ గ్రూప్ QBM మైనారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశాయి. అయితే, ఈ డీల్‌ విలువ ఎంత అనేది మాత్రం బయటకు రాలేదు. QBM అనేది వ్యాపార సంస్థ బ్లూమ్‌బెర్గ్‌క్వింట్ అనే డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల బ్లూమ్‌బెర్గ్ మీడియా క్వింట్ నుంచి విడిపోయింది.

QBMకి అదానీ గ్రూప్ చేరికకు ముందే US కంపెనీ బ్లూమ్‌బెర్గ్ మీడియా వెంచర్ విడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ మీడియా విడుదల చేసిన ప్రత్యేక ప్రకటనలో.. QBMతో తన జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్ బ్లూమ్‌బెర్గ్ వాటాను కొనుగోలు చేసిందా? లేదా ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందా? అనేదాంట్లో స్పష్టత రాలేదు.