Adani vs Hindenburg: అదాని-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణకు కమిటీ ఏర్పాటు.. ఆదేశించిన సుప్రీం కోర్టు

అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్‌ధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ఉంటారు.

Adani vs Hindenburg: అదాని-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణకు కమిటీ ఏర్పాటు.. ఆదేశించిన సుప్రీం కోర్టు

Adani vs Hindenburg: కొద్ది రోజులుగా వివాదాస్పదమవుతున్న అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్‌ధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ఉంటారు. హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ షేర్ల వ్యవహారంపై ఈ కమిటీ విచారణ చేపడుతుంది. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు సూచించింది. సీల్డ్ కవర్‌లో నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించాలని కమిటీని ఆదేశించింది. అలాగే ఈ అంశంలో ఇప్పటివరకు జరిగిన విచారణపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని సెబీని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంలోని అంశాలకు సంబంధించిన నిజాలపై శోధనతోపాటు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేలా, లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాల్ని కమిటీ పరిశీలిస్తుంది.

Mumbai Division: ముంబైలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే

నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవడంపై కూడా కమిటీ దృష్టి సారిస్తుంది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత షేర్ మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఈ అంశం దేశంలో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.