Admissions : ఆయుర్వేదిక్, హోమియోపతి కోర్సుల్లో అడ్మిషన్స్

ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి బైపీసీ సబ్జెక్ట్‌లతో ఇంటర్‌, పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Admissions : ఆయుర్వేదిక్, హోమియోపతి కోర్సుల్లో అడ్మిషన్స్

Gujarat Mbbbs

Admissions : గుజరాత్‌, గాంధీనగర్‌లోని అడ్మిషన్‌ కమిటీ ఫర్‌ ప్రొఫెషనల్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషనల్‌ కోర్సెస్‌ (ఏసీపీయూజీఎంఈసీ) లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ఆయుర్వేదిక్‌, హోమియోపతి కోర్సుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఆమేరకు బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి బైపీసీ సబ్జెక్ట్‌లతో ఇంటర్‌, పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్‌ యూజీ 2021 అర్హత తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తరవాత అభ్యర్థులు డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ కోసం హెల్ప్‌ సెంటర్లలో అప్పాయింట్‌మెంట్‌ తీసుకోవాలి.

అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ నవంబరు 28గా నిర్ణయించారు. డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నవంబరు 18 నుంచి 29 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: medadmgujarat.org