ఏరో గార్డెన్ : మట్టి అవసరం లేని మొక్కలు

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 08:16 AM IST
ఏరో గార్డెన్ : మట్టి అవసరం లేని మొక్కలు

ఇంటి ఆవరణలోనే కాదు ఇంటిలో కూడా మొక్కలు పెంచుకుంటు చల్లదనంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇంటినే పొదరిల్లులా మార్చుకోవాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.కానీ ఇంట్లో పెట్టుకున్న కుండీల్లో నీరు పోస్తే మట్టి కిందకు చేరి ఫ్లోర్ మరకలు పడుతుంటుంది. పూలకుండీ అడుగులన ప్లేట్ పెట్టినా మరకలు పడుతుంటాయి. 
మరకలు పడకపోవటమే కాదు అస్సలు మట్టే అవసరం లేని మొక్కల్ని పెంచుకుంటే మరకల సమస్యే ఉండదు కదూ. అటువంటివారికోసం ‘ ఏరో గార్డెన్’ అనే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది.దీంతో మట్టి అవసరం లేకుండానే ఇంట్లోనే మొక్కలు పెంచుకోవచ్చు. 

ఈ ఏరో గార్డెన్ కు క్రమ పద్ధతిలో నీరు, పోషకాలనుఅందిస్తే అవి మట్టి వేసి పెంచే మొక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఏరో గార్డెన్ తో కూరగాయాల్ని కూడా ఇంట్లోనే పండించుకోవచ్చు. అంటే కిచెన్ గార్డెన్ లా అన్నమాట. 

కూరగాయాలే కాకుండా..పువ్వుల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా పెంచుకోవచ్చు. దీనికి కాంపాక్ట్ ఫ్లోరో సెంట్ లైట్  కూడా ఉంటుంది. అంటే మొక్కలు పెరగటానికి ఆరోగ్యంగా ఉండటానికి సూర్యకాంతి అవసరం. ఈ కాంపాక్ట్ ఫ్లోరో సెంట్ లైట్ తో ఏరో గార్డెన్లకు అటువంటి సమస్య ఉండదు. ఆ కాంతి..దాని నుంచి వచ్చే కొద్దిపాటి వెచ్చదనం మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. 

దీంతో ఇంట్లో, ఆఫీసుల్లో చక్కగా అమర్చుకోవచ్చు. ఈ ఏరో గార్డెన్ లు ప్రముఖ ఆన్ లైన్ సంసత్థలో అందుబాటు ఉంటున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం..ఏరో గార్డెన్ లతో మీ ఇళ్లను పొదరిళ్లుగా మార్చేసుకోండి.