Aero India 2023: ఏరో ఇండియా షో కోసం మాంసం విక్రయాలపై నిషేధం.. షోకి, మాంసానికి సంబంధం ఏంటి?

ఈ నెల 13 నుంచి 20 వరకు యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో ‘ఏరో ఇండియా-2023’ షో జరగబోతుంది. దీంతో ఈ షో జరిగే ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాల్ని, జంతువధని పూర్తిగా బీబీఎంపీ నిషేధించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

Aero India 2023: ఏరో ఇండియా షో కోసం మాంసం విక్రయాలపై నిషేధం.. షోకి, మాంసానికి సంబంధం ఏంటి?

Aero India 2023: కర్ణాటక, బెంగళూరు, యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో అధికారులు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహా నగరపాలిక) సంస్థ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 20 వరకు యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో ‘ఏరో ఇండియా-2023’ షో జరగబోతుంది.

Andaman and Nicobar Islands: మహిళపై సామూహిక అత్యాచారం.. అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీటు దాఖలు

దీంతో ఈ షో జరిగే ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాల్ని, జంతువధని పూర్తిగా బీబీఎంపీ నిషేధించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం ఇక్కడి మాంసం విక్రయ కేంద్రాలు అన్నీ మూసి ఉంటాయి. అలాగే కబేళాలు/జంతు వధ కేంద్రాల్ని కూడా మూసే ఉంచుతారు. మాంసానికి సంబంధించిన ఆహార పదార్థాల్ని కూడా విక్రయించకూడదు. పది కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి మాంసం ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. అయితే, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న మాంసాహార ఉత్పత్తులు తినేందుకు మాత్రం అధికారులు అనుమతించారు.

China apps: చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్, 94 రుణ యాప్ ల‌ను నిషేధించ‌నున్న కేంద్రం

ఈ మాంసాహారానికి సంబంధించిన వ్యర్థాలను అధికారులు శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, వ్యర్థంగా మారేలా చేస్తారు. అయితే, ఏరో షో జరుగుతుంటే మాంసం విక్రయాల్ని ఎందుకు నిషేధించారు అనే అనుమానం రావడం సహజం. దీనికో కారణం ఉంది. ఇక్కడ పచ్చి మాంసం లేదా జంతు వ్యర్థాలు కనిపిస్తే వీటి కోసం అనేక రకాల పక్షులు వస్తుంటాయి. మాంసాహార పక్షులు ఈ ప్రాంతంలో వేలాదిగా ఎగురుతుంటాయి. దీనివల్ల గాలిలో ఎగిరే విమానాలకు ఆటంకం కలగవచ్చు. పక్షులు విమానాల్ని ఢీకొన్నా లేదా విమానం ఇంజిన్లలో చిక్కుకున్నా ప్రమాదకరం. అందుకే విమానాలు విన్యాసాలు చేస్తున్నప్పుడు అనుకోకుండా పక్షులు ఎగురుతూ అడ్డుగా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పక్షులు ఈ ప్రాంతంలో ఎగరకుండా చూడాలి.

దీనికి ఉన్న మార్గాల్లో ఇక్కడ వాటికి ఇష్టమైన మాంసం వంటి ఆహార పదార్థాలు కనిపించకూడదు. దీంతో పక్షులు ఇక్కడ ఎగరడం మానేస్తాయి. ఇక్కడ ఎయిర్ షో నిర్వహించేందుకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షోలో వందల సంఖ్యలో విమానాలు పాల్గొనబోతున్నాయి.