Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. సోమవారం బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ

దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంది.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. సోమవారం బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ

Aero India 2023: భారత ప్రభుత్వం ‘ఏరో ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న ఎయిర్ షోను బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో కావడం విశేషం. దీని ద్వారా భారత దేశానికి మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు తయారు చేసే సత్తా ఉందని ప్రపంచానికి తెలియజేయబోతుంది ప్రభుత్వం.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంది. ఐదు రోజులపాటు దీన్ని నిర్వహించేందుకు ఎయిర్ ఫోర్స్, ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 98 దేశాలకు చెందిన 809 రక్షణ రంగ సంస్థలు దీనిలో పాల్గొంటున్నాయి. ఈ షోలో పాల్గొంటున్న సంస్థలు, దేశాలతో 250 వరకు వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దాదాపు రూ.75,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా.

Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు

ఇది దేశంలో జరుగుతున్న 14వ ఏరో ఇండియా షో. దీనికి దాదాపు ఐదు లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ అనే కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా దేశంలో వైమానిక రంగంలోని తయారీలు, సాంకేతికత, సామర్ధ్యం వంటి విషయాల్ని ప్రపంచం ముందు ఉంచేందుకు ఈ షో ఉపయోగపడుతుంది. ఈ షోలో ఎయిర్ బస్, బోయింగ్, దస్సాల్ట్ ఏవియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, సాబ్, శాఫ్రాన్, రోల్స్ రాయిస్, లార్సెన్ అండ్ టర్బో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి సంస్థలు పాల్గొంటాయి.