India-Russia Talks : ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై భారత్-రష్యా చర్చలు!

శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

India-Russia Talks : ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై భారత్-రష్యా  చర్చలు!

Jaishnakar

India-Russia Talks శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ వాఖ మంత్రి ఎస్ జైశంకర్..శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశం కానున్నారు. కోవిడ్-19పై పోరాటంలో సహకారం సహా వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు,ద్వైపాక్షిక, రక్షణ,భద్రతకు సంబంధించి పలు అంశాలు వారి మధ్య చర్చకు రానున్నాయని తెలుస్తోంది.

ఆఫ్గనిస్తాన్ లో రాజకీయ ప్రక్రియ సహా సిరియాలో పరిస్థితి,ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై కూడా ఇద్దరు మంత్రుల మధ్య చర్యలు జరగనున్నట్లు గురువారం రష్యా విదేశాంగశాఖ తెలిపింది. యూఎన్,బ్రిక్స్,ఎస్ సీ వో వంటి వివిధ అంతర్జాతీయ వేదికల్లో రష్యా-ఇండియా సహకరించుకోవాల్సిన అంశాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా,ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్‌ అనుసరిస్తున్న వ్యూహంపై రష్యాకున్న అభ్యంతరాలు కూడా ఈ చర్చల్లో కీలకాంశం కానున్నట్లు తెలిపింది.