Shraddha murder: శ్రద్ధా హత్యకేసులో బెయిల్ వద్దన్న నిందితుడు ఆఫ్తాబ్.. పిటిషన్ కొట్టేసిన కోర్టు

శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్‌కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు.

Shraddha murder: శ్రద్ధా హత్యకేసులో బెయిల్ వద్దన్న నిందితుడు ఆఫ్తాబ్.. పిటిషన్ కొట్టేసిన కోర్టు

Shraddha Walkar murder case

Shraddha murder: దేశ రాజధాని ఢిల్లీలో కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్యకేసు సంచలనం సృష్టించిన విషయం విధితమే. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధాను నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పలు చోట్ల పడేసిన విషయం విధితమే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. శ్రద్ధా మృతదేహానికి సంబంధించి మరికొన్ని శరీరభాగాలు దొరకాల్సి ఉంది. అయితే, ఈ కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆప్తాబ్ తరపున న్యాయవాది ఈనెల 15న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Shraddha Murder Case: ఆ శరీర భాగాలు శ్రద్దా మృతదేహానివే.. డీఎన్‌ఏ రిపోర్టులో స్పష్టత

ఈ బెయిల్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు. సమాచార లోపం కారణంగానే ఈ పిటిషన్‌ను దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిందితుడు నిర్ణయించినట్లు కోర్టుకు వెల్లడించారు. దీంతో అడిషనల్ సెషన్స్ జడ్జి బృందా కుమారి ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.

Shraddha Murder Case : శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడిపై కత్తులతో దాడికి యత్నం

ఇదిలాఉంటే.. ఆఫ్తాబ్ ను పాలిగ్రాఫ్ పరీక్షల నిమిత్తం జైలు నుంచి బయటకు తీసుకురాగా.. పోలీసు వాహనంపై ఇటీవల కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆప్తాబ్ బయటకు వస్తే అతడిపై దాడిజరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు సైతం తెలిపారు. న్యాయమూర్తి అనుమతితో కోర్టుకుసైతం నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో తిహాడ్ జైల్లో ఉన్నాడు.