Kerala Man : కోవాగ్జిన్ 2 డోసులు తర్వాత కోవిషీల్డ్ కావాలంటూ కోర్టుకెక్కాడు!

కేరళలోని కన్నూరకు చెందిన ఓ వ్యక్తి కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నాడు. ఇప్పుడు చాలదన్నట్టు కోవిషీల్డ్ టీకా కూడా తీసుకుంటానంటూ పట్టుబడుతున్నాడు.

Kerala Man : కోవాగ్జిన్ 2 డోసులు తర్వాత కోవిషీల్డ్ కావాలంటూ కోర్టుకెక్కాడు!

After 2 Covaxin Doses, Kerala Man Now Wants Covishield

Kerala Man Wants Covishield : దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించడంతో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చాలామందిలో ఏయే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ అయితే వేయించుకుంటానంటూ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో రెండు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి కోవీషీల్డ్, రెండొది కోవాగ్జిన్.. ఈ రెండింటి మధ్య గ్యాప్ కూడా వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది కోవిషీల్డ్ వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. మరికొంతమంది కోవాగ్జిన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు సమర్థవంతమైనవే అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్…సీరం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా కేరళలోని కన్నూరకు చెందిన ఓ వ్యక్తి కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నాడు. ఇప్పుడు చాలదన్నట్టు కోవిషీల్డ్ టీకా కూడా తీసుకుంటానంటూ పట్టుబడుతున్నాడు. రెండు డోసులు తీసుకున్నాక మరో వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదన్న వినలేదు. మరోసారి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతించాలంటూ ఏకంగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కేరళ వ్యక్తి పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రం కేరళ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ఇప్పటికే అతడికి యాంటీవైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వడం జరిగిందని, మరోసారి వ్యాక్సిన్ వేయడం ఇవ్వరాదని కేంద్రం కోర్టుకు వివరించింది.

రెండు డోసులకు మించి టీకా తీసుకుంటే : 
సాధారణంగా.. రెండు కంటే ఎక్కువ టీకాలు పొందిన వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి రెండు డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎలాంటి నిబంధన లేదు. అలా అని టీకా మూడవ డోస్‌ని పొందాలంటూ అంతర్జాతీయ మార్గదర్శకం కూడా లేదు. అధిక మోతాదు టీకాతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎలాంటి అధ్యయనాలు కూడా నిర్వహించలేదు. ఈ కేసులో పిటిషనర్ వాదనను పరిగణించలేమని కేంద్రం అభిప్రాయపడింది. ఈ డిమాండ్‌ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇదే డిమాండ్‌తో ఎక్కువ మంది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది.
ICMR Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి వేసుకోవచ్చు..ఐసీఎంఆర్ కీలక ప్రకటన

కేరళకు చెందిన 50 ఏళ్ల గిరికుమార్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అక్కడ కోవాక్సిన్ ఇంకా గుర్తింపు లభించలేదు. అతడి వీసా నిబంధన ప్రకారం.. ఆగస్టు 30 లోపు సౌదీ అరేబియాకు తిరిగి రావాల్సి ఉంది. లేదంటే తన ఉద్యోగం పోతుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందుకే తనకు సౌదీలో ఆమోదించిన కోవిషీల్డ్ టీకా వేయాలని కోరుతున్నాడు.

గిరి కుమార్ పిటిషన్ ప్రకారం..
గత జనవరిలో సౌదీ అరేబియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో 45ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభించింది. దాంతో గిరి కుమార్ తన పాస్ పోర్టు వివరాలతో Cowin పోర్టల్ లో నమోదు చేసుకున్నాడు. ఏప్రిల్ 17న అతడికి Covaxin ఫస్ట్ డోస్ అందుకున్నాడు. మరో నెల తర్వాత కోవాగ్జిన్ రెండో డోసు కూడా అందుకున్నాడు. ఆ తర్వాతే అతడికి కోవాగ్జిన్ టీకాను సౌదీ ప్రభుత్వం ఆమోదించలేదని తెలిసింది. కోవాగ్జిన్ టీకాకు సౌదీలో ధ్రువీకరించలేదని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ విషయం ముందే తెలిసి ఉంటే తాను కోవాగ్జిన్ తీసుకుని ఉండేవాడిని కాదని, ఇప్పుడు తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.