Facebook Mother :ఫేస్‌బుక్‌ ఫొటోతో 20 ఏళ్ల క్రితం అదృశ్యమైన తల్లి ఆచూకీ లభ్యం

స్ బుక్..20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తల్లి జాడా తెలిపింది. ఫేస్ బుక్ లోని ఫొటో ద్వారా తల్లి ఆచూకీ లభించింది. 20 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన తల్లిని పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.

Facebook Mother :ఫేస్‌బుక్‌ ఫొటోతో 20 ఏళ్ల క్రితం అదృశ్యమైన తల్లి ఆచూకీ లభ్యం
ad

mother on Facebook : ఆధునిక సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్స్‌, సోషల్‌ మీడియాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తాజాగా ఫేస్ బుక్..20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తల్లి జాడా తెలిపింది. ఫేస్ బుక్ లోని ఫొటో ద్వారా తల్లి ఆచూకీ లభించింది. 20 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన తల్లిని పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.

వివరాల్లోకి వెళితే..ముంబయిలో నివసించే హమీదా బాను కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న కోరికతో వంట మనిషిగా ఖతర్‌తోపాటు ఇతర అరబ్‌ దేశాల్లో పనిచేసింది. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల అనంతరం దుబాయ్‌కు వెళ్లిన హమీదా బాను అదృష్యమైంది. తల్లి ఎక్కడ, ఎలా ఉందో అని దుబాయ్‌కు పంపిన ఏజెంట్‌ వద్ద ఆమె కుమారుడు యాస్మీన్‌ షేక్‌, కుమార్తె షాహీదా ఆరా తీశారు.

Vizianagaram : ఆరేళ్ల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం

ఆమె ఆనందంగానే ఉందని.. అయితే ఎక్కడ ఉందో చెప్పకూడదని తనతో ఒట్టేయించుకుందని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక నిరూత్సహంగా ఇంటి ముఖం పట్టారు. అయినా, తల్లి జాడ కోసం కుమారుడు, కుమార్తె పట్టు సడలించలేదు. ఏదో ఒకరోజు తమను కలుస్తుందన్న ఆశతో వెతుకుతుండగా పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజీలో ఫొటో రూపంలో తల్లి హమీదా బాను ప్రత్యక్షమైంది.

దీంతో సంతోషపడ్డ వారు ఆమెను పాకిస్తాన్‌ నుంచి ముంబయికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హమీదా బాను కుమారుడు యాస్మీన్‌ షేక్‌ విజ్ఞప్తి చేశారు. 20 ఏళ్ల తర్వాత తన తల్లి జాడ తెలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన తల్లి ఫొటో షేర్‌ చేసిన పాకిస్తాన్‌కు చెందిన మారుఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని కలవడం అద్భుతంగా ఉందని షాహీదా చెప్పారు.