APSEZ : అదానీ సంచలన నిర్ణయం..ఆ దేశాల కార్గోలను హ్యాండిల్ చేయం

అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్‌లో గత నెలలో రూ.20 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం

APSEZ : అదానీ సంచలన నిర్ణయం..ఆ దేశాల కార్గోలను హ్యాండిల్ చేయం

Adani (2)

APSEZ అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్‌లో గత నెలలో రూ.20 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ భారీ డ్ర‌గ్ స్కామ్‌తో షాక్ తిన్న అదానీ పోర్ట్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. న‌వంబ‌ర్ 15 నుంచి ఇరాన్‌, అఫ్ఘ‌ానిస్తాన్‌, పాకిస్తాన్‌ల నుంచి వ‌చ్చే కంటైనరైజ్డ్ కార్గోల‌ను APSEZ(Adani Ports and SEZ Ltd)హ్యాండిల్(ఎగుమతి-దిగుమతి) చేయ‌బోదని అదానీ గ్రూప్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ థ‌ర్డ్ పార్టీ టెర్మిన‌ల్స్ స‌హా అదానీ పోర్ట్స్ నిర్వ‌హించే అన్ని టెర్మిన‌ల్స్‌కూ ఇది వ‌ర్తిస్తుంద‌ని సృష్టం చేసింది.

కాగా, గ‌త నెల‌లో ప్రాసెస్ చేయ‌ని టాల్క‌మ్ పౌడ‌ర్ పేరుతో పెద్ద పెద్ద బ్యాగుల‌లో హెరాయిన్‌ అప్ఘానిస్తాన్ నుంచి ముంద్రా పోర్ట్ కి తరలించారు. పైన టాల్క‌మ్ పౌడ‌ర్ రాళ్ల‌ను పెట్టి, కింది భాగంలో డ్ర‌గ్స్ ఉంచారు. ఈ భారీ అక్ర‌మ ర‌వాణా వెలుగు చూసిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా సోదాలు జ‌రిగాయి. అఫ్ఘ‌ాన్‌, ఉజ్బెకిస్తాన్‌ల‌కు చెందినవాళ్లతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు.

మాదకద్రవ్యాల రవాణాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తరువాత, అదానీ గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో… దేశవ్యాప్తంగా ఏ పోర్ట్ ఆపరేటర్ కంటైనర్‌ని పరిశీలించలేరు. వారి పాత్ర పోర్టును నడపడానికి మాత్రమే పరిమితం చేయబడింది. APSEZ ఒక పోర్ట్ ఆపరేటర్ షిప్పింగ్ లైన్‌లకు సేవలను అందిస్తోంది. కంటైర్లపై మాకు పోలీసింగ్ అథారిటీ లేదు లేదా ముంద్రా లేదా మరేదైనా మేము నిర్వహిస్తున్న పోర్ట్ లలోని టర్మినల్స్ గుండా వెళ్లే మిలియన్ టన్నుల కార్గోను తనిఖీ చేసేందుకు మాకు అధికారం లేదని తెలిపింది.

ALSO READ భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా