Banaras Railways Map : 64ఏళ్ల తర్వాత రైల్వే మ్యాప్‌లోకి ‘బనారస్‌’గా రీఎంట్రీ!

యూపీలోని వారణాసిలో మండుడిహ్ రైల్వే స్టేషన్ పేరును ‘బనారస్’గా మార్చేశారు నార్త్ ఈస్టరన్ రైల్వే (NER) అధికారులు. 64ఏళ్ల తర్వాత భారత రైల్వే మ్యాప్‌లోకి బనారస్ గా తిరిగి చేరింది.

Banaras Railways Map : 64ఏళ్ల తర్వాత రైల్వే మ్యాప్‌లోకి ‘బనారస్‌’గా రీఎంట్రీ!

After 64 Years, 'banaras' Returns On Railways Map

Banaras Railways Map : యూపీలోని వారణాసిలో మండుడిహ్ రైల్వే స్టేషన్ పేరును ‘బనారస్’గా మార్చేశారు నార్త్ ఈస్టరన్ రైల్వే (NER) అధికారులు. 64ఏళ్ల తర్వాత భారత రైల్వే మ్యాప్‌లోకి బనారస్ గా తిరిగి చేరింది. ఇటీవలే రైల్వే స్టేషన్ పేరుమార్పుపై NERకు రైల్వే బోర్డు సూచించింది. రైల్వే శాఖ సూచన మేరకు పాత సైన్ బోర్డు స్థానంలో కొత్త పేరుతో Banaras గా మార్చేశారు NER అధికారులు. ఈ మేరకు NER డివిజినల్ రైల్వే మేనేజర్ (వారణాసి) విజయ్ కుమార్ పంజియార్ తెలిపారు.

మండుడిహ్ రైల్వే స్టేషన్‌ను బనారస్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్చేందుకు రైల్వే బోర్డు నుంచి తుది ఆమోదం లభించినట్టు ఆయన చెప్పారు. ఇప్పటి నుంచి బనారస్ రైల్వే స్టేషన్ (BSBS) కొత్త కోడ్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సైన్ బోర్డులపై పేర్లు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో కనిపించనున్నాయి. ఈ రైల్వేస్టేషన్ పేరు మార్పుకు సంబంధించి 2019 ఫిబ్రవరిలోనే ప్రస్తుత జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిపాదించినట్టు NER అధికారులు తెలిపారు.

2019 ఏడాది ఆఖరిలో ఈ ప్రతిపాదనను యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అంగీకరించగా.. అనంతరం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. సెప్టెంబర్ 16, 2020లోనే మండుడిహ్ రైల్వే స్టేషన్ పేరును బనారస్ రైల్వే స్టేషన్ గా మార్చాలని నిర్ణయించారు. అప్పటినుంచి రైల్వే అధికారులు పాత రైల్వే సైన్ బోర్డుల స్థానంలో కొత్త పేర్లతో మార్చడం ప్రారంభించారు. కానీ, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 20, 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత సరిగ్గా 64 ఏళ్ల తర్వాత బనారస్ రైల్వే స్టేషన్ గా భారత రైల్వే మ్యాప్ లోకి వచ్చిచేరింది.