Maharashtra Nurses : మహారాష్ట్రలో నర్సుల సమ్మె

ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.

Maharashtra Nurses : మహారాష్ట్రలో నర్సుల సమ్మె

Maharashtra Nurses

Maharashtra Nurses ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు. అధిక పనిభారం మరియు సెలవులు లేవని వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని జెజె హాస్పిటల్ కు చెందిన 1,300 మంది నర్సులతో సహా రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు చెందిన 5,000 మందికిపైగా నర్సులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం 48 గంటల సమ్మెను ప్రారంభించారు. గడిచన 2 రోజుల నుంచి కొద్ది గంటల పాటు వారు నిరసన వ్యక్తం చేసినప్పటికీ..ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బుధవారం 48 గంటల నిరవధిక సమ్మెను ప్రారంభించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని..దీంతో తమపై అధిక పనిభారం పడుతోందని నర్సులు తెలిపారు. కోవిడ్ కారణంగా తమకు సెలవులు కూడా లభించట్లేదన్నారు. తమ నర్సింగ్ అలవెన్స్ లను కూడా అందించడం లేదన్నారు. నర్సుల సమ్మె నేపథ్యంలో వారి జీతం రూ.1000,కోవిడ్ అలవెన్స్ 500 పెంచేందుకు అంగీకరిస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. మరోవైపు, మహారాష్ట్రలోని దాదాపు 65,000 మంది ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూన్-15నుంచి సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో సమావేశాలు జరిగినప్పటికీ వారి డిమాండ్లు ఇంకా పరిష్కరించబడలేదు.