చెల్లి కోసం అన్న ట్వీట్..జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన రైలు

చెల్లి కోసం అన్న ట్వీట్..జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన రైలు

Railway తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిన ఓ యువతి కష్టాన్ని రైల్వేశాఖ తీర్చింది. ఒకే ఒక్క ట్వీట్ తో రెండున్నర గంటల ఆలస్యంగా వస్తున్న రైలు కాస్తా జెట్ స్పీడ్ తో దూసొకొచ్చింది. ఆ యువతిని గమ్యస్థానానికి అంతే వేగంతో చేర్చింది. ఉత్తరప్రదేశ్ లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ ప్రాంతానికి చెందిన నజియా తబస్సమ్ అనే యువతికి వారణాలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి పరీక్ష ఉంది. దీంతో చప్రా నుంచి వారణాసికి వెళ్లే రైలు(05111) లో ఆమె టికెట్ బుక్ చేసుకుంది. వాస్తవానికి ఆ రైలు మౌ జంక్షన్ కు ఉదయం 6.25 గంటలకు చేరుకోవాలి. కానీ ఉదయం పూట మంచు ఎక్కువగా ఉండటంతో రైలు ఆలస్యంగా నడుస్తోంది. దాని వల్ల ఉదయం 8గంటలు దాటినా ఆ రైలు అక్కడికి చేరుకోలేదు. దీంతో తాను పరీక్ష మిస్సవడం ఖాయమని భయంగా తన సోదరుడు అన్వర్ జమీల్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

రైలు ఆలస్యమైతే మా చెల్లె పరీక్ష రాయలేదు. దయచేసి తొందరగా రండి అంటూ తబస్సమ్ సోదరుడు జమాల్‌ భారతీయ రైల్వేను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. నిమిషాల్లోనే రిైప్లె వచ్చింది. తర్వాత అతని చెల్లెలు తబస్సమ్‌కు ఫోన్‌ వెళ్లింది. మీరేమీ బాధపడకండి. మిమ్మల్ని సకాలంలో గమ్యం చేర్చే బాధ్యత మాది అని రైల్వే అధికారులు ఆమెకు హామీనిచ్చారు. అన్నట్టుగానే 45 నిమిషాల ముందే గమ్యానికి చేర్చారు.