Cyber ​Aattack On AIIMS,ICMR Servers : భారత్‌లోని ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్ ..AIIMS,ICMR సర్వర్లపై హ్యాకర్ల దాడులు చైనా పనేనా?

ఆస్పత్రుల వెబ్‌సైట్లు, సర్వర్ల మీద పడ్డారు హ్యాకర్లు. ఇప్పటికే ఎయిమ్స్ వెబ్‌సైట్ నుంచి రోగుల డేటాను కాజేసిన హ్యాకర్లు.. ఇటీవలే ఐసీఎంఆర్ సర్వర్‌పైనా సైబర్ ఎటాక్ చేశారు. 24 గంటల్లో ఏకంగా 6 వేల సార్లు దాడి చేశారు. దీని వెనుక చైనా ఉందన్న ప్రచారం.. సైబర్‌ వార్‌ఫేర్‌పై అనుమానాలు పెంచుతోంది.. సరిహద్దుల్లో ఏమీ చేయలేక. .ఇలా సైబర్‌ దాడులకు దిగిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Cyber ​Aattack On AIIMS,ICMR Servers : భారత్‌లోని ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్ ..AIIMS,ICMR సర్వర్లపై హ్యాకర్ల దాడులు చైనా పనేనా?

Cyber ​Aattack On AIIMS,ICMR Servers

Cyber ​Aattack On AIIMS,ICMR Servers : సోషల్ మీడియా అకౌంట్స్ అయిపోయాయ్. బ్యాంక్ అకౌంట్స్ అయిపోయాయ్. ఇప్పుడు.. ఆస్పత్రుల వెబ్‌సైట్లు, సర్వర్ల మీద పడ్డారు హ్యాకర్లు. ఇప్పటికే ఎయిమ్స్ వెబ్‌సైట్ నుంచి రోగుల డేటాను కాజేసిన హ్యాకర్లు.. ఇటీవలే ఐసీఎంఆర్ సర్వర్‌పైనా సైబర్ ఎటాక్ చేశారు. 24 గంటల్లో ఏకంగా 6 వేల సార్లు దాడి చేశారు. దీని వెనుక చైనా ఉందన్న ప్రచారం.. సైబర్‌ వార్‌ఫేర్‌పై అనుమానాలు పెంచుతోంది.. సరిహద్దుల్లో ఏమీ చేయలేక. .ఇలా సైబర్‌ దాడులకు దిగిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ సరిహద్దుల్లోనే కాదు.. దేశానికి సంబంధించిన ప్రభుత్వ వెబ్ ‌సైట్లు, సర్వర్లపైనా దాడులు మొదలయ్యాయ్. ఈ సైబర్ ఎటాక్స్‌తో.. కీలకమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తూ.. కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నారు. ఇంకొన్నిసార్లు విఫలయత్నం చేస్తున్నారు శత్రు దేశాలకు చెందిన హ్యాకర్లు. గత నెలలోనే.. ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్.. ఎయిమ్స్ స‌ర్వర్‌ను హ్యాక్ చేసి రోగుల డేటాను కొట్టేశారు. అదే ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రి సర్వర్‌పైనా సైబర్ ఎటాక్ జరిగింది. డేటా లీక్ అయినప్పటికీ.. ఎయిమ్స్‌తో పోలిస్తే అదేమంత పెద్ద నష్టం కాదు. సైబర్ ఎటాక్ జరిగిన టైంలో.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సర్వర్ డౌన్ అయింది. డేటా మాత్రం భద్రంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తమ సర్వర్లను.. ఐటీ, ఎన్ఐసీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఇక.. తమిళనాడులోని శ్రీశరణ్‌ ఆస్పత్రిపైనా హ్యాకర్లు పంజా విసిరారు. తర్వాత డేటాను రికవరీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సైబర్ అటాక్ చేసిన ఐపీ అడ్రస్‌ను సైతం బ్లాక్ చేశారు. ఈ సైబర్ ఎటాక్స్ వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

India-China: చైనాకు రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వార్నింగ్

గత నవంబర్ చివర్లోనే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. ఐసీఎంఆర్ వెబ్‌సైట్ సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు.. హ్యాకర్లు విఫలయత్నం చేశారు. దీంతో భారత వైద్య రంగానికి సంబంధించిన వెబ్‌సైట్లు, ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్ల సర్వర్లపై జరగబోయే దాడులపై ఆందోళన నెలకొంది. నవంబర్ 30న ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసేందుకు.. 24 గంటల్లో.. 6 వేల సార్లు ప్రయత్నించారు. దీంతో.. ఐసీఎంఆర్ సర్వర్ డౌన్ అయినప్పటికీ.. డేటా మాత్రం సేఫ్‌గా ఉందని అధికారులు తెలిపారు. ఈ సైబర్ దాడుల వెనుక.. హాంకాంగ్‌కు చెందిన హ్యాకర్లు ఉన్నట్లు తేలింది. రాన్సమ్‌వేర్‌ అనే మాల్‌వేర్‌ని ఉపయోగించి, బ్లాక్ చేసిన ఐపీ అడ్రస్‌తో.. ఐసీఎంఆర్ సర్వర్‌ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒక వేళ హ్యాకర్లు గనక ఐసీఎంఆర్ సైట్‌ని క్రాక్ చేసి ఉంటే.. విలుమైన సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయేది.

అయితే.. ఇలా ఆస్పత్రుల అధికారిక వెబ్‌సైట్లు, సర్వర్లపై సైబర్ ఎటాక్స్ జరగడం ఇదేం తొలిసారి కాదు. 2020 నుంచి ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌ని.. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నిర్వహిస్తోంది. ఎన్ఐసీ ఎప్పటికప్పుడు ఫైర్‌వాల్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఈ-మెయిల్ ద్వారా సైబర్ అటాక్ జరుగుతున్న విషయం తెలుసుకొని.. హ్యాకర్ల ప్రయత్నాలను తిప్పికొట్టారు. అంతేకాదు.. సైబర్ అటాక్‌కు పాల్పడిన వారిని కూడా బ్లాక్ చేశారు. ఫైర్‌వాల్‌లో గనక ఏవైనా లూప్ హోల్స్ ఉండి ఉంటే.. కీలకమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించి ఉండేవారు. కానీ.. ఫైర్‌వాల్ స్ట్రాంగ్‌గా ఉండటంతో.. డేటా లీక్ కాలేదు. ఎయిమ్స్ సర్వర్లపై.. రాన్సమ్‌వేర్ ఎటాక్ జరిగిన తర్వాత.. కొన్ని రోజుల దాకా సర్వర్లు పనిచేయడం మానేశాయి. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ల వివరాలన్నీ మాన్యువల్‌గానే నమోదు చేశారు. ప్రస్తుతం.. పేషెంట్ల వివరాలన్నింటిని.. కంప్యూటర్లలోనే నమోదు చేస్తున్నారు. ఎయిమ్స్‌కు సంబంధించిన ఐదు మెయిన్ సర్వర్లపై సైబర్ ఎటాక్ చేసి.. రోగుల డేటాను దొంగిలించారు. దానిని.. డార్క్ వెబ్‌లో అమ్మేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాన్సమ్‌వేర్ ఎటాక్ తర్వాత.. దర్యాప్తు సంస్థల డైరెక్షన్‌లో.. ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీ పాలసీ విధానాన్ని రూపొందించుకునే పనిలో ఉంది. హైప్రొఫైల్ వ్యక్తుల డేటా ఉండటం, దేశ భద్రతకు ముడిపడి ఉండటంతో.. ఎన్ఐఏ, సీబీఐ, ఐబీ, సైబర్ సెక్యూరిటీ సంస్థలు సైతం.. ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నాయ్.

China Spy Ship ‘Yuan Wang 5’ : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక కలకలం .. భారత్‌పైనే కన్ను

పేషెంట్ల డేటా చాలా రంగాలకు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. డ్రగ్ కంపెనీలు ఈ డేటాను కొనుగోలు చేస్తాయి. ఏయే మెడిసిన్లు.. రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి? తమ ఔషధాలను ఎలా ప్రమోట్‌ చేయాలి? అనే కోణంలో డేటాను సేకరిస్తాయి. అదే ఈ-కామర్స్‌ సంస్థలైతే.. టెలీమార్కెటింగ్‌కు ఆ డేటాను వాడుకుంటాయి. కొన్ని ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థలు, ఫార్మసీ చైన్‌లకు కూడా పేషెంట్ల డేటానే అత్యంత కీలకం. పైగా.. సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవారు, శాస్త్రవేత్తలు కూడా పెద్ద మొత్తంలో కేస్ స్టడీల కోసం.. పేషెంట్ల డేటా కొనుగోలు చేస్తారు. అమెరికా, ఐరోపా దేశాలకు పేషెంట్‌ డేటా లీక్‌ సమస్య.. పదేళ్లుగా ఉంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ తరహా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి.

ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. 200 కోట్లు డిమాండ్‌ చేశారు. తమిళనాడు శ్రీశరణ్‌ మెడికల్‌ సెంటర్‌ సర్వర్‌పై దాడి చేసి.. లక్షన్నర మంది పేషెంట్ల వివరాలను కొల్లగొట్టారు. ఆ డేటానే.. డార్క్‌ వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టారు. 8 వేలు ఇస్తే చాలు.. లక్షన్నర మంది డేటాను ఇచ్చేస్తామంటూ.. వంద డెమో వివరాలను అప్‌లోడ్ చేశారు. అదే డేటాను మళ్లీ మళ్లీ అమ్ముకోవాలనుకునే వారు 30 వేలకు పైగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్‌ పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్‌, చిరునామా, చికిత్స పొందుతున్న వ్యాధి వివరాలు, చికిత్స అందిస్తున్న డాక్టర్‌ వివరాలు సహా.. అన్నీ డార్క్‌వెబ్‌లో సిద్ధంగా ఉన్నాయి.