Kappa Variant : యూపీలో కొత్త రకం కరోనా..’కప్పా’ వేరియంట్ కేసులు..

ఉత్తరప్రదేశ్ లో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు.

Kappa Variant : యూపీలో కొత్త రకం కరోనా..’కప్పా’ వేరియంట్ కేసులు..

Kappa Variant In Up

Kappa Variant In UP : భారత్ లో కరోనా తగ్గుతోంది అనుకుంటుంటే మరోపక్క ఈ మహమ్మారి కొత్త కొత్త విధంగా రూపాంతరం చెందుతోంది. కొత్తగా మార్పుచెందుతోంది. అంతకంతకూ ప్రతాపాన్ని పెంచుకుంటోంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా డెల్టా వేరియంట్ అతలాకుతలం చేసింది. చేస్తోంది. భారత్ లోనే కాదు అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్ రకాలతో పోల్చితే ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది.

కరోనా వైరస్ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది కింగ్ జెరోజ్ యొక్క మెడికల్ కాలేజీలో నిర్ధారించబడింది.

109 నమూనాలను పరీక్షించగా..ఈ 109 నమూనాలలో 107 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులుగా నిర్ధారించబడ్డాయి. వీరిలో ముగ్గురిలో కప్పా వేరియంట్‌కు సంబంధించి లక్షణాలున్నాయని వెల్లడించారు. సంత్ కబీర్ నగర్‌లో నివసిస్తున్న 66 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ముగ్గురిలో ఈ లక్షణాలున్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కప్పా వేరియంట్ చాలా ఫాస్టుగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని నిపుణులు భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ను నిర్ధారించారు. కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు.