Punjab: సీఎంను కలుసుకున్నాక మనసు మార్చుకున్న గవర్నర్.. అసెంబ్లీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్

ముందుగా అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్‭లో రెండు రోజుల క్రితం నిరసన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు’, ‘ఆపరేషన్ లోటస్ ముర్దాబాద్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

Punjab: సీఎంను కలుసుకున్నాక మనసు మార్చుకున్న గవర్నర్.. అసెంబ్లీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్

After face off, Governor approves convening of Vidhan Sabha session on Sept 27

Punjab: సెప్టెంబర్ 27న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా చండీగఢ్‭లోని రాజ్ భవన్‭ను వచ్చి గవర్నర్‭ను కలుసుకున్నాక. కాగా, ఇంతకు ముందు ఈ సమావేశాల నిర్వహణ ఉత్త్వర్వులను ఉపసంహరించుకున్న గవర్నర్.. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ప్రత్యేక సమావేశానికి ఆమోదం తెలపడం గమనార్హం. ఈ విషయమై పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మాట్లాడుతూ ‘‘మా వినతికి గవర్న్ ఆమోదం తెలిపారు. ఈ నెల 27న అసెంబ్లీ మూడవ సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని పేర్కొన్నారు.

పంజాబ్‭లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందన్న ఆరోపణలతో ప్రభుత్వం బలపరీక్షకు వెళ్లేందుకు సిద్ధమైంది. దీని కోసమే ఈ నెల 22నే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అనంతరం సెప్టెంబర్ 27న నిర్వహించాలనే నూతన ప్రతిపాదనతో స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లి గవర్నర్‭ను కలుసుకున్నారు. సీఎంతో పాటు స్పీకర్ సైతం వెళ్లారు. అనూహ్యంగా ఈసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

కాగా, ముందుగా అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్‭లో రెండు రోజుల క్రితం నిరసన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు’, ‘ఆపరేషన్ లోటస్ ముర్దాబాద్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

25 Crore Lottery: లాటరీ గెలిచాక ప్రశాంతత పోయింది.. నిద్ర కూడా పట్టడం లేదు.. కారణం వాళ్లే