Five State Election : మంచి పనులు చెప్పండి, నాతో డిన్నర్ చేయవచ్చు.. కేజ్రీ ఆఫర్

తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న...

Five State Election : మంచి పనులు చెప్పండి, నాతో డిన్నర్ చేయవచ్చు.. కేజ్రీ ఆఫర్

Arvind Kejriwal

Dinner With 50 Delhiites Kejriwal : ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆప్ పార్టీ. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. వినూత్నంగా ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలే తెలియచేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని వారికి పంపించాలని కోరారు.

Read More : Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. పరువు హత్యగా అనుమానం

బాగా వైరల్ అయిన వీడియోలు చేసిన వారిలో 50మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ 50 మందిని తాను కలవడం జరుగుతుందని..అంతేగాకుండా…డిన్నర్ మీట్ లో పాల్గొంటానని చెప్పారు. ఢిల్లీలో చేసిన తాము మంచి పనులు ఇతర రాష్ట్రాల్లో చేయగలమని కేజ్రీవాల్ తెలిపారు.

Read More : AP Casino Issue : బుద్దా వెంకన్న అరెస్టు..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 403 సీట్లు ఉండగా…ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది.
ఉత్తరాఖండ్ లో 70 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
గోవా రాష్ట్రంలో 40 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
మణిపూర్ రాష్ట్రంలో 28 సీట్లు ఉండగా…రెండు విడుతల్లో (ఫిబ్రవరి 27, మార్చి 03) తేదీల్లో పోలింగ్ జరుగనుంది.