Centre Writes To States : ఆక్సిజన్ మరణాల లెక్క చెప్పండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

  కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.

Centre Writes To States : ఆక్సిజన్ మరణాల లెక్క చెప్పండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Oxygen

Centre Writes To States  కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే ఆసస్టు-13లోగా ఈ సమాచారాన్ని అందజేయాలని రాష్ట్రాలను లేఖలో కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మరణాలపై అనేక ప్రశ్నలు వస్తుండటంతో ఈ లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రాలు పంపే వివరాలు పార్లమెంటులో తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, కోవిడ్ రెండో దశ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని ఇటీవల పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరత కారణంతో మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలేవీ నివేదించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ ఈ నెల 20న పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు తాజాగా లేఖ రాసింది.