Punjab Elections: నా టికెట్ ను సోనూసూద్ చెల్లికి ఇచ్చారు అందుకే బీజేపీలో చేరా: హర్ జోత్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.

Punjab Elections: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు. 2017లో మొగా అసెంబ్లీ స్థానంలో గెలిచిన హర్ జోత్ కమల్.. బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ అధిష్టానం ఒక్కసారిగా కంగుతినింది. కాగా హర్ జోత్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొగా స్థానంలో.. సోనూసూద్ సోదరి, మాళవిక సూద్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. పార్టీ నిర్ణయంతో ఏకీభవించని హర్ జోత్ కమల్ కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిందని.. అందుకే బీజేపీలో చేరి అదే స్థానంలో పోటీలో నిలబడనున్నట్లు హర్ జోత్ ప్రకటించారు.
Also read: Kanuma Special: కోనసీమలో కనులపండువగా ప్రభల తీర్థం ఉత్సవాలు
టికెట్ ఇవ్వకపోగా తనను వేరే స్థానం నుంచి పోటీ చేసుకోమని బిరుసు సమాధానం ఇచ్చారంటూ హర్ జోత్ ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తానూ..మొగా నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. టికెట్ కేటాయింపులపై మాట మాత్రం చెప్పలేదని, రెండు రోజుల క్రితం మొగా పర్యటనకు వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్దు..తనను కలవకుండా నేరుగా సూద్(సోనూసూద్) ఇంటికి వెళ్లారని.. హర్ జోత్ కమల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: Vijayawada News: ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలం
సోనూసూద్ సోదరి మాళవికాకు టికెట్ ఇవ్వడంలో తనకేమి అభ్యంతరం లేదని.. సొంతచెల్లెలి లాంటి ఆమెకు టికెట్ ఇవ్వడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు హర్ జోత్ కమల్ చెప్పుకొచ్చారు. అయితే సొంత నియోజకవర్గం మొగా టికెట్ ను తనకు కాదని ఆమెకు ఎలా ఇస్తారంటూ హర్ జోత్ ప్రశ్నించారు. కేవలం సోనూసూద్ చెల్లిగా తప్ప, మాళవికాకు ఉన్న రాజకీయ పలుకుబడి ఏంటంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై పీపీసీసీ అధ్యక్షుడు సిద్దు స్పందిస్తూ..హర్ జోత్ తనకు ఎంతో ఆప్తమిత్రుడని అన్నారు. సీఎం చరణ్జిత్ స్పందిస్తూ పార్టీ అధిష్టానం మేరకే తామంతా నడుచుకుంటున్నట్లు తెలిపారు.
Also read: EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు
- Punjab Election Review: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన “త్రిమూర్తులు”
- AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్
- Punjab Election 2022 : సోనూ సూద్ కదలికలిపై నిఘా, కారు సీజ్
- Manmohan Singh: ఏడున్నరేళ్ల తర్వాత కూడా నెహ్రూని నిందిస్తారా? దేశం పరువు తీస్తున్నారు -మన్మోహన్ సింగ్
- Arvind Kejriwal: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు
1Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
2బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
3Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
4Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
5Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
6Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
7Benz: 1955 నాటి బెంజ్.. ధర రూ.1,117 కోట్లు
8Dhanush: కతిరేసన్ దంపతులకు ధనుష్ నోటీసులు
9Road accident: తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..
10Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం