ఇదెక్కడి లాజిక్కు మంత్రి గారు: మంచి రోడ్లుంటేనే ప్రమాదాలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : September 13, 2019 / 09:02 AM IST
ఇదెక్కడి లాజిక్కు మంత్రి గారు: మంచి రోడ్లుంటేనే ప్రమాదాలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు రోడ్లను బాగుచేసి ఫైన్ లు విధించాలంటూ వాహనదారులు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు.

లేటెస్ట్ గా బెంగళూరులో ఓ వ్యక్తి రోడ్డుపై ఆస్ట్రోనాట్ గా మారి రోడ్ల పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేయగా.. ఇదే విషయమై మీడియా కర్ణాటకలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో అక్కడి నేతలు చెప్పిన సమాధానాలు కాస్త ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. రోడ్లు మంచిగా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కర్జోల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రతీ ఏటా 10వేల రోడ్డు ప్రమాదాలు రోడ్లు దయనీయంగా ఉండడం వల్లే జరుగుతుంటే.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖా మంత్రి డీవీ సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు అయితే మరీ విడ్డూరంగా ఉన్నాయి. రోడ్లు బాగుంటే యువత ఎక్సలేటర్‌ను మరింతగా వాడుతారని, అందువల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటాయని సదానంద గౌడ అన్నారు.

రోడ్లు బాగుంటే యువత వాటిపై హైస్పీడ్‌తో దూసుకెళ్తారని, గతుకుల రోడ్లు ఉంటే తక్కువ వేగంతో వాహనాలు వెళ్తాయి కాబట్టి ప్రమాదాలు పెద్దగా జరగవని ఆయన అభిప్రాయపడ్డారు.