Covid Spike: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత గోవాలో చెలరేగుతున్న కొవిడ్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని ఊహించిన దానికంటే 10శాతం అదనంగా లిస్టులోకి చేరాయని రికార్డులు చెబుతున్నాయి.

Covid Spike: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత గోవాలో చెలరేగుతున్న కొవిడ్

Covid Spike

Covid Spike: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని ఊహించిన దానికంటే 10శాతం అదనంగా లిస్టులోకి చేరాయని రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 671 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీనిని అడ్డుకునేందుకే స్టేట్ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ లాంటి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

గత డిసెంబర్ కంటే ముందు నమోదైన కేసుల కంటే.. క్రిష్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత నమోదైన కేసుల సంఖ్య రెట్టింపుగా ఉంది. ఆదివారం నాటికి కొవిడ్ పాజిటివిటీ రేటు 10.7శాతం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

గోవా సెలబ్రేషన్స్ ను ఉదహరిస్తూ.. కొవిడ్ వ్యాప్తి ఇలాం ఉందని మరో నెటిజన్ హాస్యాస్పదంగా కామెంట్ చేశాడు. ‘కొవిడ్ వేవ్ రావడానికి రాచమర్యాదలతో స్వాగతం చెబుతున్నారు. చాలా మంది టూరిస్టులతో గోవా నిండిపోయింది. నార్త్ గోవాలోని బాగా బీచ్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత లైవ్‌లో దీప్తీ కన్నీళ్లు

అధికార యంత్రాంగం అలర్ట్ అయి జనవరి 26వ తేదీ వరకూ ఫిజికల్ సెషన్స్ అయిన క్లాస్ 8, క్లాస్ 9 పిల్లలు రేపటి నుంచి స్కూల్స్ కు రావొద్దని చెప్పేశారు. 11, 12 తరగతి చదివే పిల్లలు వ్యాక్సిన్ తప్పనిసరి. ఆ లోగా కొవిడ్ 19 వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకునే స్కూల్ కు అటెండ్ కావాలని పిలుపునిచ్చారు.