చర్చలకు సిద్దమే..తేదీని ఖరారు చేయండి : రైతు సంఘాలు

చర్చలకు సిద్దమే..తేదీని ఖరారు చేయండి : రైతు సంఘాలు

PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభుత్వమే ఒక తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నాయి. ప్రభుత్వం-రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 11 రౌండ్లు చర్చలు జరిగి..ఆ చర్చలు అసంపూర్తిగానే ముగిసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పుడు మేమెప్పుడూ తిరస్కరించలేదు. కేంద్ర మంత్రులతో మేం భేటీ అయ్యాం. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. ప్రజాస్వామ్యంలో నిరసనలకు పెద్ద పాత్ర ఉంది. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలను వ్యతరేకించే హక్కు.. ప్రజలకు ఉంది అని సంయుక్త కిసాన్​ మోర్చా సీనియర్ సభ్యుడు శివ కుమార్​ కక్కా తెలిపారు. ప్రభుత్వం-రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 11 రౌండ్లు చర్చలు జరిగి..ఆ చర్చలు అసంపూర్తిగానే ముగిసిన విషయం తెలిసిందే.

ఇక, దేశంలో ‘ఆందోళన జీవులు’ అనే కొత్త రకం జీవులు ఏర్పడ్డాయని రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను రైతు సంఘాలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు ప్రముఖ పాత్ర పోషించాయని పేర్కొన్నాయి. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పుడూ ఉంది, ఇక మీదటా ఉంటుంది ఇవాళ రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై రైతు నాయకులు భిన్నంగా స్పందించారు. ప్రభుత్వం వంద సార్లు కనీస మద్దతు ధర ఉంటుందని చెప్పింది. మరి అలాంటప్పుడు దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోతోందని సంయుక్త కిసాన్​ మోర్చా నేత అభిమన్యు కోహర్​ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోతోందో తెలుసుకోవాలని ఉందని పంజాబ్ భారతీయ కిసాన్ యూనియన్​(బీకేయూ) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్​ సింగ్​ అన్నారు. అసలు విషయాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు.