మండుతున్న ఇంధన ధరలు : మధ్యప్రదేశ్‌లోనూ పెట్రోల్ రూ.100 దాటేసింది!

మండుతున్న ఇంధన ధరలు : మధ్యప్రదేశ్‌లోనూ పెట్రోల్ రూ.100 దాటేసింది!

petrol crosses 100-mark in Madhya Pradesh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 10వరోజున పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబుల్ డిజిట్ ఉండే ఇంధన ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ డిజిట్ క్రాస్ అయ్యాయి. మొన్నటివరకూ ధర రూ.74 నుంచి 90 మధ్య ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటేశాయి. రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్ ధరలు వంద మార్క్ దాటేశాయి. లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంధన ధరలు రూ.100 మార్క్ దాటాయి. రెగ్యులర్ పెట్రోల్ ధర రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ టౌన్ లో బుధవారం పెరిగాయి. గురువారం రోజున మధ్యప్రదేశ్ లో పెట్రోల్ ధరలు పెరిగాయి. రాష్ట్రంలోని అనప్పూర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.25 కు చేరింది.. లీటర్ డీజిల్ ధర రూ.90.35లకు చేరింది. స్థానిక టాక్స్ లు, వ్యాట్ ను బట్టి ఇంధన ఛార్జీలు ఆధారపడి ఉంటాయి.

దేశంలో పెట్రోల్‌పై అత్యధిక వ్యాట్ పడిన రాష్ట్రంగా రాజస్థాన్ నిలవగా, తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. మధ్యప్రదేశ్‌లో ఒక లీటర్ పెట్రోల్ పై 33శాతానికిపైగా అంటే రూ.4.5 వరకు పెరిగింది. అలాగే 1 శాతం చెస్ పెరిగింది. ఇక డీజిల్ పై ఒక లీటర్ కు రూ. 3 చొప్పున 23శాతానికి పైగా పెరిగింది. 1 శాతం చెస్ పడింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.89.88 ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.80.27 వరకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర లీటర్ రూ.96.32 పెరగగా.. డీజిల్ లీటర్ ధర రూ.87.32 వరకు పెరిగింది.