ట్రాక్టర్ ర్యాలీ తర్వాత రైతుల కొత్త తరహా నిరసన: సైకిళ్లతో..

ట్రాక్టర్ ర్యాలీ తర్వాత రైతుల కొత్త తరహా నిరసన: సైకిళ్లతో..

FARMERS PROTEST: కేంద్రం నుంచి వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది మూడు నెలలు దాటిపోయింది. దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరి పట్టించుకోకుండా ఉంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డేకు ట్రాక్టర్ పరేడ్ చేపట్టి నిరసన చేపట్టారు. ఆ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రైతులు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 8వేల 308కిలోమీటర్ల దూరం సైకిల్ ర్యాలీ చేపట్టి నిరసన తెలియజేయనున్నారు. 20రాష్ట్రాలను కవర్ చేయనున్న ఈ ర్యాలీ మార్చి 12 నుంచి మొదలుకానుంది. సైకిల్స్ తొక్కలేని వాళ్లు ఇతర వాహనాలతో పాల్గొనవచ్చు.

‘సైకిల్ మార్చ్‌ను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిగే యాత్రతో రైతుల ఆందోళనపై అవగాహన పెంచాలనుకుంటున్నాం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల గురించి తెలియజేయాలనుకుంటున్నారు. మార్చి 12నుంచి జరిగే యాత్రలో 70 నుంచి 80మంది సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ల నుంచి పాల్గొననున్నారు’

Delhi Police notices to farmers' union leaders

దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఒకచోటకు చేర్చాలని.. కార్పొరేట్ సెక్టార్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు 11రౌండ్ల పాటు జరిగాయి. 2020 నవంబర్ 26 నుంచి దేశ రాజధానిలో పలు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. Farmers’ Produce Trade and Commerce Act 2020; Farmers Agreement of Price Assurance and Farm Services Act 2020, Essential Commodities Act, 2020లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.