ఆన్ లైన్ లో పరిచయం, అమ్మాయిని కలవడానికి 2 వేల కిలోమీటర్ల ప్రయాణం..చివరిలో ట్విస్ట్

ఆన్ లైన్ లో పరిచయం, అమ్మాయిని కలవడానికి 2 వేల కిలోమీటర్ల ప్రయాణం..చివరిలో ట్విస్ట్

girl friend : ఆన్ లైన్ లో అమ్మాయితో పరిచయం అయ్యింది. తరచూ మాట్లాడుకొనే వారు. ఆ యువతిని యువకుడు లవ్ చేయగసాగాడు. ఆమె కూడా ప్రేమిస్తోందని భావించాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు తెలియదు. ఎలాగో ఆమె అడ్రస్ తెలుసుకున్నాడు. ఆమె జన్మదినం సందర్భంగా సర్ ఫ్రైజ్ ఇద్దామని ఏకంగా 2 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. కానీ..చివరిలో ట్విస్ట్ జరిగింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో సల్మాన్ అనే యువకుడు చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో యువతితో పరిచయం ఏర్పడింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లాలోని ఖేరి గ్రామం. ఇద్దరూ తరచూ గంటల తరబడి చాటింగ్ చేసుకొనే వారు. ఈ క్రమంలోనే..2021, జనవరి 10వ తేదీన ఆమె పుట్టిన రోజు వచ్చింది. బర్త్ డే రోజున సర్ ఫ్రైజ్ చేద్దామని..ఆమె సొంతూరికి వెళ్లాలని అనుకున్నాడు. చాక్లెట్లు, టెడ్డీ బేర్ ఇచ్చి ప్రేమను పంచాలని అనుకున్నాడు. వెంటనే బెంగళూరు నుంచి బయలుదేరాడు ఈ హీరో. లక్నోకు విమానంలో చేరుకుని..అక్కడి నుంచి లఖింపూర్ కు బస్సులో వెళ్లాడు. యువతి ఉండే గ్రామానికి ఆటోలో వెళ్లాడు. తనన చూడగానే..వాటేసుకుంటుందని కలలు కన్నాడు.

అయితే.. సీన్ రివర్స్ అయ్యింది. ఎవరండి మీరు అంటూ యువతి క్వొశ్చెన్ వేసింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు..సల్మాన్ ను నిలదీశారు. అనంతరం పోలీసులకు పట్టించారు. తనెవరో తెలియదని ఆ యువతి కంప్లైట్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాగొలా..బెయిల్ తీసుకుని బెంగళూరుకు వచ్చాడు.