India Lockdown : మే 3 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్..? ప్రధాని మోదీ సంచలన నిర్ణయం…?

కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం

India Lockdown : మే 3 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్..? ప్రధాని మోదీ సంచలన నిర్ణయం…?

India Lockdown

India Lockdown : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో మరింతగా రెచ్చిపోతోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేయకపోతే వచ్చే నెలలో రోజువారీ కేసుల సంఖ్య 10లక్షల వరకు వెళ్లొచ్చని, మరణాల సంఖ్య 5వేలకు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. మే 2న పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత లాక్ డౌన్ పై ప్రధాని మోదీ ప్రకటన చేస్తారని దాని సారాంశం. కాగా, దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పింది. అయితే, తాజా ప్రచారంపై మాత్రం ఇంకా స్పందించలేదు. మరి, ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండిస్తుందో, లేక కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కేవల 3 రోజుల్లోనే 10లక్షల కేసులు, 7వేల మరణాలు:
దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. మునుపటితో పోలిస్తే అత్యంత వేగంగా విరుచుకుపడుతోంది. భారత్‌లో తొలి 10లక్షల కేసులు నమోదవడానికి దాదాపు 150 రోజులు పట్టగా.. సెకండ్ వేవ్ (రెండో దశ)లో కేవలం మూడంటే మూడు రోజుల్లోనే దాదాపు 10లక్షల కొత్త కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. గడిచిన 72 గంటల్లో దేశంలో 10లక్షల కొత్త కేసులు నమోదవగా.. దాదాపు 7వేల మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తోంది.

మూడు రోజుల క్రితం దేశంలో తొలిసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. ఏప్రిల్‌ 21 ఉదయం 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 3,14,835 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత వరుసగా రోజువారీ కేసులు 3.32లక్షలు, 3.46లక్షల పైనే నమోదయ్యాయి. ఇక వరుసగా నాలుగో రోజు మరణాల సంఖ్య 2వేల పైనే ఉంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25లక్షలు దాటడం గమనార్హం.

74శాతం కేసులు 10 రాష్ట్రాల్లో:
రెండు దశలో తొలుత మహారాష్ట్రలో కరోనా విజృంభించింది. ఇప్పుడు చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 74.15శాతం కేసులు 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర సహా ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలిపాయి. ఇక 12 రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పైపైకి పోతున్నాయి.