Agakara : ఆగాకర సాగు…అనుకూల వాతావరణం, నేలలు

సాగుకు అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమ అవసరం. మధ్యస్తమైన, లోతు కలిగిన సారవంతమైన ఎర్ర నల్ల, ఇసుక నేలలు సాగుకు పనికొస్తాయి..

Agakara : ఆగాకర సాగు…అనుకూల వాతావరణం, నేలలు

Aakaakara Kaayalu (1)

Agakara : ఆగాకర దోస కుటుంబానికి చెందిన బహువార్షిక కూరగాయ. ఒకసారి నాటితే అనేక సంవత్సరాల వరకు పంటను తీసుకోవచ్చు. ఆగాకరనే తెలుగులో “బోడికాకర, బొంత కాకరా అని అంటారు. ఆగాకర బహావార్షిక పంట. ఇది తీగలా ప్రాకుతుంది. దీనిలో మగ, ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి. మొదటి భాగం చిలగడ దుంప మాదిరిగా లావుగా తయారవుతుంది. అకులు దొండ ఆకారంలో ఉండి 3-4 తమ్మెలతో ఉంటాయి. పూలు పనువు రంగులో ఉంటాయి. కాయలు నిమ్మకాయలంత పరిమాణంలో 25-63 సెం.మీ పొడవుతో ఉండి, కాయల మీద మృదువైన ముంద్లు ఉంటాయి. పచ్చికాయ ఆకుపచ్చ రంగులో, పండిన కాయ నారింజ రంగులో ఉండి, గింజలు ఎర్రని గుజ్జులో పొదిగి ఉంటాయి.

లేత కాయలను కూరగాయగా వాడుతారు. పండిన కాయలు కూరకు పనికిరావు. ఆగాకర వేరు దుంపలను. జీర్ణ, మూత్ర వ్యవస్థ సందింధిత రోగాల నివారణ కోసం వాడుతారు. అగాకర లేత కాయలను వేపుళ్ళకును, పచ్చళ్ళకుగాను, కూరగాను తింటారు. దీనిలో ధయామిన్‌, రైబోఫ్లావిన్‌, నియానిన్‌, పీచుపదార్థం, కెరోటిన్‌,వంటి పోషకాలు ఉన్నాయి. చర్మ మరియు దగ్గు, ఆయాసం వంటి శ్వాన వ్యాధులకు, కడుపులో అల్సర్లకు, పైల్స్‌కు, కామెర్లు లాంటి కాలేయ, విత్తాశయ, మూత్రసంబంధిత రోగాలకు కూడా ఉపయోగిస్తారు.

బంగ్లాదేశ్‌, భారతదేశంతోపాటు, ఎత్తైన కొండ గుట్టల్లో, సహజ సిద్ధంగా పెరుగుతుంది. ముఖ్యంగా అస్సాం, ఒరిస్సా, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో,పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర కేరళలో ఉంది. ఇది ఎక్కువగా కాలువ, చెరువు గట్లపై బీడు భూములలో వాగుల్లో , తుప్పల్లో, కొండ ప్రాంతాలలో సహజనిద్ధంగా తీగలా అల్లుకొని కాయలు కాసే కూరగాయ. ఈ మధ్య కాలంలోనే దీనిని సాగులోకి తేవటం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు.

అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమతో కూడిన వాతావరణం ఆగాకర సాగుకు అనుకూలం. తెలుగు రాష్ట్రాల్లో ఉభయ గోదావరి ఇల్లాలు, ఖమ్మం, విజయనగరం, ఏశాఖవల్నం, శ్రీకాకుళం మరియు. తెలంగాణలోని అదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జల్లాల్లోని అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాలు, అనువైనవి. ఎర్రనేలలు, సారవంతమైన ఇనుక నేలలు అనుదూలం. కొండల మీది కొద్దిపాటి లోతుగల రాళ్ళతో కూడిన ఎర్రనేలల్లో కూడా సాగుచేయవచ్చు.

మైమోర్డియా కొచ్చిన్ చైనసిస్ అనే రకం ఎక్కవగా ఒరిస్సా, తూర్పు రాష్ట్రాలలో సాగులో ఉంది. దీని కాయలు పెద్దవిగా కోడిగుడ్డు ఆకారంలో ఉండి 40 గ్రాముల బరువు ఉంటాయి. పూలు తెల్లగా ఉండి ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఫిబ్రవరి నుండి మే, జూన్‌ వరకు సాగులో ఉంటుంది. గింజలు తెల్లగా కాకర గింజల్లా ఉంటాయి. వైమార్జియా డయాకా అనే రెండో రకం ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడే జాతి. దీని కాయలు 2-6 వెం.మీ. పొడవుతో ఉంటాయి. మెత్తని ముళ్లు కాయనిండా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఆందంగా ఉంటాయి. కాయలు 15-20 గ్రా. బరువులో చిన్నవిగా ఉంటాయి. పూలు పనువు వర్ణంలో ఉంటాయి.