Agni-V Ballistic Missile : అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ప్రయోగం విజయవంతం

ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో

Agni-V Ballistic Missile : అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ప్రయోగం విజయవంతం

Agni

Agni-V Ballistic Missile  రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.

5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలిగే సామర్థ్యమున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) బుధవారం విజయవంతంగా పరీక్షించింది.

అగ్ని-5 సిరీస్‌ ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అయితే దీనికి సంబంధించి సంబంధిత వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది.

ALSO READ Saudi Aid To Pak : పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించిన సౌదీ